నకిలీ ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు

0
TMedia (Telugu News) :

టి-మీడియా( జూన్ 13)కర్నూలు జిల్లా మహానంది

s s consultancy

మహానంది మండలం గాజులపల్లి గ్రామంలో సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ దుకాణాల్లో వ్యవసాయ శాఖ, పోలీస్ వారు సంయుక్తంగా విస్తృత తనిఖిలు నిర్వహించారు.
నకిలీ విత్తనాలు, పురుగు మందులు , ఎరువులు నిషేధిత గడ్డి మందులు(గ్లైపోటోసిన్) రైతులకు విక్రయిస్తే వారిపై చీటింగ్ కేసులతో పాటు, సీడ్స్ చట్టం ప్రకారం కూడా కేసులు నమోదు చేస్తామని, అవసరం అయితే పీడీ చట్టం కూడా ప్రయోగిస్తామని, గ్రామాల్లోకి వచ్చి విడిగా అమ్మే విత్తనాలు కొనవద్దని సూచించారు.
అలాంటి వారి సమాచారం పోలీస్ వారికి అందించాలని కోరారు.
మండల స్థాయిలో నకిలీ విత్తనాల నిర్మూలనకు, వ్యవసాయ, పోలీస్ శాఖలతో సంయుక్తంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
మండల వ్యవసాయాధికారి సుబ్బారెడ్డితో కలిసి ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించినారు
రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి పాటు పడాలని పలు సూచనలు చేశారు.

  • రైతులకు నకిలీ మందులు విక్రయించి వారికి నష్టం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరికలు చేసిన మహానంది ఎస్సై సిసి నాగార్జునరెడ్డి.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.