జొన్నల కొనుగోలు విషయంలో రైతుల విజయం

0
TMedia (Telugu News) :

ఆదిలాబాద్ జిల్లా..

జొన్నల కొనుగోలు విషయంలో రైతుల విజయం
రైతు స్వరాజ్య వేదిక వేసిన పిల్ లో ప్రభుత్వ తీరు పట్ల హై కోర్టు తీవ్ర అసంతృప్తి
జొన్నల కొనుగోలు పై కోర్టులో ప్రభుత్వ హామీ; రెండు రోజుల్లో జీవో జారీ

తెలంగాణ లో ప్రభుత్వం జొన్నలను కొనుగోలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ రైతు స్వరాజ్య వేదిక తరఫున ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు సంగేపు బొర్రన్న జూన్ 1వ తేదీన హై కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం A PIL (WP (PIL) 52 of 2021) వేశారు. ఈ పిల్ పై ఈ రోజు కోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున వాదించిన వకీలు కేసును వాయిదా వేయాలని చోసినప్పటికీ, చీఫ్ జస్టిస్ జోక్యం చేసుకుని ఒక వైపు వర్షాలు పడుతుండటంతో జొన్నలు తడిచి పదవుతున్నా ప్రభుత్వం చర్య తీసుకోకపోవటం గురించి తీవ్రంగా స్పందించారు. దీనితో ప్రభుత్వ వకీలు మళ్ళీ మధ్యాహ్నం తిరిగి వచ్చి జొన్నల కొనుగోలు గురించి ప్రభుత్వం రెండు రోజులలో ఉత్తరువు (జి ఓ ) జారీ చేస్తుంది అని చెప్పాడు. కోర్టు ఈ కేసును జూన్ 14 వ తేదీకి వాయిదా వేసింది. ఇది గత నెల రోజులుగా ఆందోళనలు, నిరసనలు చేస్తూన్న జొన్న రైతులు సాధించిన ఘన విజయం. ఎట్టకేలకు ప్రభుత్వం జొన్నలను కొనుగోలు చేస్తామని నిర్ణయించటంతో ఆదిలాబాద్ జిల్లా రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

s s consultancy

నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో జొన్న పంటను కొనుగోలు చేయాలి అని నిర్ణయించినట్లు తెలిసినప్పటికీ, జొన్న రైతులకు మద్దతుగా ఒకవేళ కోర్టులో ఈ పిల్ వేయకపోయినట్లయితే ప్రభుత్వం జొన్నల కొనుగోలు విషయంలో ఇంత త్వరగా నిర్ణయం తీసుకోవటం జరిగేది కాదు.

ఆదిలాబాద్ జిల్లాలో రబీ సీజన్ లో రైతులు మొత్తం 4.50 లక్షల టన్నుల జొన్నలు పండించారు. ప్రభుత్వం మొక్కజొన్నలు సాగుచెయ్యొద్దు అని చెప్పినప్పటికీ ఇతర పంటలతో పాటు మొక్కజొన్నను కూడా కొనుగోలు చేసింది. మక్కజొన్నల స్థానంలో పండించిన జొన్నలను మాత్రం కొనుగోలు చేయలేదు. అంతకుముందు రెండు సంవత్సరాలు ప్రభుత్వం కనీస మద్దతు ధరకు జొన్నలను కొనుగోలు చేయటంతో ఆదిలాబాద్ జిల్లాలో రైతులు వాతావరణానికి అనుకూలమైన స్థానిక రకం జొన్న పంటను వేశారు. ఈవిషయమై రైతులు, రైతు సంఘాలు అనేకసార్లు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం జొన్నలను కొనుగోలు చేయకపోవటం చేత, కనీస మద్దతు ధర క్వింటాలుకు 2660 రూపాయలు ఉండగా బోథ్, , నేరేడిగొండ మండలాలలో చాలా మంది రైతులు 900 -1200 రూపాయలకే ప్రయివేటు వ్యాపారులకు అమ్ముకుని నష్టపోయారు. ప్రభుత్వం దీనిని పట్టించుకోకుండా రైతులను ప్రయివేటు వాయపారస్థుల ఇష్టాయిష్టాలకు వదిలేసింది.

ప్రభుత్వం జొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కు రెండు సార్లు విజ్ఞాపన పత్రాలను ఇచ్చారు. గత నెలరోజులుగా అనేక సార్లు నిరసన ప్రదర్శనలు చేశారు. జూన్ మొదటి వారంలో కామారెడ్డిలో జొన్న రైతులు హైవే దిగ్బంధం చేశారు. స్థానిక ఎం ఎల్ ఏ నెల రోజుల క్రితం ముఖ్యమంత్రిని కలిసి ఈ సమస్యను వివరించాడు. ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు సోయం బాబురావు ద్వారా కూడా ప్రభుత్వానికి ఈవిషయమై సలహా ఇవ్వమని గవర్నర్ కు విజ్ఞాపన పత్రం పంపించారు. ఇంత జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం జొన్నల కొనుగోలు విషయంలో తాత్సారం చేస్తూ వచ్చింది. మే 25 వ తేదీన బోథ్ మండలానికి చెందిన రాజు అనే రైతుతో వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి TSAT ఫోన్ ద్వారా మాట్లాడుతూ రైతులు తమకు ఇష్టం వచ్చిన పంటను పండిస్తే ప్రభుత్వం ఎందుకు కొంటుంది, మార్కెట్ కి అనుకూలమైన పంటలనే రైతులు పండించాలి, ప్రభుత్వ సేకరణపైన రైతులు ఆధారపడకూడదు అని చెప్పాడు. ప్రభుత్వానికి రైతుల ప్రయోజనం పట్ల ఎటువంటి అక్కర లేదనీ, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను అనుగుణంగానే వ్యవసాయ మంత్రి ఈ విధంగా మాట్లాడాడని అర్ధమవుతుంది.

తమ డిమాండును సాధించుకునే వరకు నిరసనలు, ఆందోళను సాగించి పోరాడి, తమ గొంతును రాష్ట్రవ్యాప్తంగా వినిపించిన రైతులకు రైతు స్వరాజ్య వేదిక అభినందనలు తెలియజేస్తున్నది. తెలంగాణ హై జొర్టు కూడా ఇందులో జోక్యం చేసుకుని రైతుల డిమాండ్ నెరవేరేటట్లు చేసింది. కనీస మద్దతు ధరకోసం ఆదిలాబాద్ జిల్లాలో జొన్న రైతులు సాగించిన ఆందోళనలు దేశవ్యాప్తంగా మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసి కనీస మద్దతు ధరకు హామీ కలిపించాలని జరుగుతున్న ఉద్యమంలో భాగంగానే చూడాలి. కనీస మద్దతు ధరకు ప్రభుత్వం పంటలను కొనుగోలు చేయకపోతే రైతులు మార్కెట్ శక్తుల కోరలలోకి నెట్టబడతారని ఈ విషయం స్పష్టం చేసింది.

వివరాలకు:
శ్రీహర్ష: 9966089839
బొర్రన్న: 8106318135

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.