సీజన్ మొదలైంది రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దు :- యంపిపి బానోత్.శ్రీనివాస్.

0
TMedia (Telugu News) :
s s consultancy

వానాకాలం సీజన్ మొదలైనది రైతులందరిని అప్రమత్తం చేయాలని,నకిలీ విత్తనాలు అరికట్టి,రైతు బంధు అందరికీ అందేలా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపిపి బానోత్ శ్రీనివాస్ అన్నారు. కూసుమంచి లోని మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని ఏఈవో వ్యవసాయ శాఖ అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ అవుతుందని అందరికీ అందేలా చూడాలని కొత్తగా మండలంలో 719 మంది రైతులకు రైతుబంధు మంజూరైనట్లు తెలిపారు, దరఖాస్తు చేసుకున్న అందరికీ రైతుబంధు అందేలా ఏఈవోలు గ్రామాల్లో ఉన్న రైతులను చైతన్యవంతులను చేయాలని కోరారు, నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, రైతులకు రసీదు ఇవ్వకపోయిన,దుకాణాల్లో అధిక ధరలకు ఎరువులు అమ్మిన,నకిలీ విత్తనాలు అమ్మిన వెంటనే ఫిర్యాదు చేయాలని కోరారు. దీనిపై గ్రామాల్లో పురుగు మందుల దుకాణాల్లో నిత్యం నిఘా ఉంచాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. తొలకరి వర్షాలతో రైతులు పంటలు వేస్తున్నందున వారికి ఒకే రకమైన పంటలు కాకుండా లాభసాటిగా ఉండే విధంగా అప్రమత్తం చేయాలని అవగాహన కల్పించాలని ఏ ఈ ఓ లకు. సూచించారు.. తెలంగాణ ప్రభుత్వం కెసిఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు ప్రవేశపెట్టి రైతు బాంధవుడిగా నిలిచిపోయాడని,రైతులకు సంతోషం కలిగినప్పుడే లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. కూరగాయలు,పండ్లు,పూలు వంటివాటి పంటలు సాగు పై రైతులకు అవగాహన పెంచాలని దాని ద్వారా మంచి లాభాలు వస్తాయని ఇటువంటి విషయాన్ని రైతులకు తెలియజేయాలని కోరారు. వ్యవసాయ శాఖ లో పనిచేస్తున్న ఏ ఈ ఓ లు తమ పరిధిలోని రైతులకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామాల్లో రైతులకు ఇబ్బందులు తప్పకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి ఆర్ వాణి మండలంలోని ఏ ఈ ఓ లు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.