నిబంధనలు పాటించని దుకాణాలకు జరిమానాలు

0
TMedia (Telugu News) :
s s consultancy

నిబంధనలు పాటించని దుకాణాలకు జరిమానాలు వేసిన పేట ఎస్ఐ నరేందర్
టీ మీడియా మెదక్ జిల్లా శంకరంపేట్ ఆ *మే 15):
పెద్దశంకరంపేట లో లాక్ డౌన్ నియమ నిబంధనలు పాటించనీ పలు దుకాణాల యజమానులకు శనివారం పేట ఎస్ఐ నరేందర్ జరిమానాలు విధించారు.ఉదయం 10 గంటల తర్వాత తెరిచి ఉన్న దుకాణాలకు ఈ జరిమానా విధించడంతో పాటు 10 గంటల లోపు అన్ని దుకాణాలు తప్పనిసరిగా మూసివేయాలని ఆయన సూచించారు.తెలంగాణ ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు పాటించాలని.సడలింపు సమయంలో బయటికి వచ్చే ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని ఆయన పేర్కొన్నారు.నిబంధనలు పాటించని యెడల చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.పేటలో 10 గంటల తర్వాత అన్ని దుకాణాలు మూసి వేయడంతో జనాలు లేక రహదారులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఆయన వెంట పంచాయతీ ఈవో విట్టల్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.