ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు: ఏపిజివిబి మేనేజర్ హరీష్ కుమార్.

0
TMedia (Telugu News) :

టీ మీడియా నెక్కొండ మండలం అక్టోబర్13 : వరంగల్ జిల్లా నెక్కొండ మండలం చిన్న కొరుపోల్ గ్రామంలో నాబార్డ్ వారి ఆర్థిక సహాయంతో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు కేసముద్రం తెలంగాణ ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్ బి హరీష్ కుమార్ సమక్షంలో, కళజాత బృందం ద్వారా బ్యాంక్ సేవలు, వాటి వినియోగం, వాటి వలన కలిగే లాభాలు తదితర విషయాల గురించి గ్రామంలో నీ ప్రజలకు, మహిళ సంఘాలకు, రైతులకు, ఖాతాదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సు కు ముఖ్య అతిథిగా ఆర్థిక అవగాహన సదస్సు కౌన్సిలర్ ఎమ్ ప్రేమ్ కుమార్ హాజరై పలు విషయాల గురించి గ్రామ ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతు ప్రతి ఒక్క ఖాతా దారులు ఆర్థిక అక్షరాస్యత కలిగి ఉండాలని, గ్రామాలలో ఏర్పాటు చేసిన బ్యాంక్ మిత్ర సేవలను వినియోగించుకోవాలని, 18 సం రాలు నిండిన ప్రతి ఒక్కరు బ్యాంక్ ఖాతా తీసుకోవాలని, ఖాతాకు పొన్, ఆధార్ నెంబర్ అనుసంధానం చేసుకోవాలని, మొబైల్, ఇంటర్ నెట్ బ్యాంకింగ్ సేవలతో పాటు, రూపే ఏటీఎమ్ కార్డ్ లాంటి సేవలను వినియోగించుకుంటే సమయం చాలా ఆద అవుతుందని అన్నారు.

s s consultancy

ముఖ్యంగా రైతులు వ్యాయసాయ పంట రుణాలను ప్రతి సారి సంవత్సరం లోపు రెన్యువల్ చేసుకోవడం ద్వారా తక్కువ వడ్డీ తో పాటు, వడ్డీ రాయితీ కూడా వస్తుందని వివరించారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వారు తము తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించటం ద్వారా అధిక రుణాలు పొందవచ్చని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా, సురక్ష భీమా యోజన లను ప్రతి ఖాతాదారులు వినియోగించుకోవాలని అన్నారు. ఈ భీమా సౌకర్యాలను వాడుకోవటం వలన ప్రతి ఖాతా దారుడు సహజ మరణం అయితే 2 లక్షలు, ప్రమాదవశాత్తు చనిపోతే 4 లక్షలు వారి కుటుంబ సభ్యుల నామినులకు అందచేయటం జరుగుతుందని అన్నారు. ఎస్బిఐ జనరల్ ఇన్సూరెన్స్ సేవలకు ఒక సంవత్సరానికి వెయ్యి రూపాయలు చెల్లిస్తే ప్రమాదంలో మరణించినచో 20 లక్షల భీమ సౌకర్యం కల్పించబడుతుందని, దీనిని 18 సం రాల నుండి 65 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఉందని అన్నారు.

ఏపిజివిబి బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతు బ్యాంక్ సేవలను ప్రతి ఖాతా దారుడు వినియోగించుకోవాలని రైతులు, మహిళ పొదుపు సంఘాల రుణాలను సకాలంలో చెల్లించటం ద్వారా అధిక రుణాలు పొందవచ్చని అన్నారు. ప్రతి ఖాతాదారులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక అవగాహన సదస్సు కౌన్సిలర్ ఎమ్ ప్రేమ్ కుమార్, బ్యాంక్ మేనేజర్ బి హరీష్ కుమార్, గ్రామ సర్పంచ్ కర్ర వెంకట్ రెడ్డి, ఉప సర్పంచ్ భర్మవత్ చంద, వార్డు సభ్యులు, కో ఆఫ్షన్ సభ్యులు, బ్యాంక్ సిబ్బంది సమ్మెట శ్రీనివాస్, కళజాత బృందం వారు, గ్రామ రైతులు, మహిళ పొదుపు సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Financial Literacy Awareness seminar.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.