అడవే ఐసొలేషన్‌

0
TMedia (Telugu News) :

అడవే ఐసొలేషన్‌

భూపాలపల్లి:

ఆ అటవీ గ్రామంలో కొందరు కరోనా బారినపడ్డారు.

వారిని పట్టించుకునే దిక్కే లేదు. దీంతో వారు అడవినే ఐసొలేషన్‌ గా మార్చుకున్నారు.

s s consultancy

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం యత్నారం అనే అటవీ గ్రామంలో 3 రోజుల్లో 34 మంది కరోనా బారినపడ్డారు.

ఒక్కో కుటుంబంలో ఇద్దరు నుంచి నలుగురికి కోవిడ్‌ సోకింది.

ఇళ్లలోనే ఉంటే అందరికీ కోవిడ్‌ వైరస్‌ సోకుతుందన్న ఉద్దేశంతో ఆ ఏడు కుటుంబాలకు చెందిన 20 మంది గ్రామశివారులోని అటవీ ప్రాంతాన్ని ఐసొలేషన్‌గా ఎంచుకున్నారు.

కొంతమంది అక్కడే వంట చేసుకుంటుండగా, మరికొంతమందికి కుటుంబ సభ్యులు ఇంటి నుంచి ఆహారాన్ని పంపిస్తున్నారు.

ఇంతవరకూ తమ వద్దకు అధికారులు, నాయకులు రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.