కరోన లో.. వదలని ఫైనాన్స్ భూతం:అదే బాటలో లో బ్యాంకర్లు

0
TMedia (Telugu News) :

కరోన లోను వదలని ఫైనాన్స్ భూతం:అదే బాటలో లో బ్యాంకర్లు

(టీమీడియా ప్రత్యేకప్రతినిది)

మీరు ఈ ఎమ్ఐ కట్ట లేదు.వెంటనే చెల్లించండి,చెక్కు బౌన్స్ అయింది 1000 రూపాయలు జరిమానా మొత్తం కార్యాలయంలో చెల్లించండి.లేదా మీ ఇంటికి, పనిచేసే వద్దకు వచ్చి రచ్చ చేస్తాము మీ ఇష్టం అంటూ..కొంత మంది ప్రవైట్ ఫైనాన్స్ ర్లు తో పాటు ప్రభుత్వ రంగం లో ఉన్న బ్యాంకర్లు ఫోన్ లు చేసి మరీ బెదిరింపులుకి పాల్పడుతున్నారు..మోటారు సైకిళ్ళు మొదలు హౌసింగ్,తనకా లోనులు విషయంలో లోను ఇదే పద్దతి కొనసాగుతోంది.

కరోన నేపథ్యం లో ఉపాది కోల్పోయి తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఉన్న వారికి బ్యాంకర్లు,ప్రవైట్ ఫైనాసర్లు ఇబ్బందులు ఎక్కువ అయ్యాయి.ఖమ్మం నగరం లో ప్రవైట్ పనులు చేసు కొనే టెక్నీషియన్ 18 నెలల క్రితం ఇల్లు తాకట్టు పెట్టి 4 లక్షలు అప్పు ప్రవైట్ ఫైనాన్స్ కంపెనీ లో అప్పు తీసుకున్నాడు.ఒక్క నెల బకాయి లేకుండా ఈ ఎమ్ ఐ కట్టుకొంటు వస్తున్నాడు.మే నెల ఈ ఏమ్ఐ 10 తేదీ చెల్లించ లేక పోయాడు. అప్పటి వరకు వాయిదా లోపు చెల్లించండి అని ఫోన్ లు చేసిన ఫైనాసర్లు,12 వ తేదీ ఇంటి వద్దకు వచ్చి రచ్చ చేయడం జరిగింది. పరువు కోసం ఇంట్లో వస్తువు తాకట్టు పెట్టి 10 వేలు ఇస్తే కాదు మరో 2 వేలు ఫైన్ అంటూ 12 వేలు వసూలు చేసి 10,500 లు కు రసీదు ఇచ్చి మిగతావి సర్వీస్ ఛార్జ్ అంటూ ఆ సంస్థ రికవరీ వాళ్ళు వెళ్లి పోయారు.. ఇటువంటి వి అనేకం ఉన్నాయి.

మరో కేసులో ఒక వృత్తి దారుడు ని..ఈ నెల ఈఎమ్ ఐ 15 వతేది వరకు చెల్లించాలి లేనట్లు అయితే మీ ఇంటికి వచ్చి ఇంటి ముందు గొడవ జరుగుతుంది అని ఒక జాతీయ బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసి బెదిరించిన ఆడియో టి మీడియా కి చిక్కింది.సార్ కరోన వల్ల వృత్తి నడవడం లేదు అని బ్రతిమి లాడు కొన్న కుదరదు అంటూ హెచ్చరించడం జరిగింది..ఇటువంటి బైటకు రానివి అనేకం ఉన్నాయి

s s consultancy

అనుమతుల్లేని ఫైనాన్స్

వడ్డీ వ్యాపారము చెయ్యాలి అంటే ప్రభుత్వ అనుమతులు ఉండాలి.అందుకు ఆర్డీవో వద్ద దరఖాస్తు చేసుకొని మనిల్యాడ రింగ్ లైసెన్స్ పొందాలి.ప్రతి నెల ఇచ్చిన అప్పులు తీసుకొన్న వడ్డీ వివరాలు ఆర్డీవో కార్యాలయంలో ఇవ్వాలి.ఇవి ఏమి లేకుండా వ్యాపారం చేస్తున్నారు.ఈ విదమైన వ్యాపారం చెయ్యడంలో ప్రభుత్వస్కూల్ టీచర్లు ఉన్నారు.
రికవరీ ఏజంట్లు దందా
అనుమతులు లేని ప్రవైట్ ఫైనాసర్లు ,చట్ట విరుద్ధంగా రికవరీ ఏజంట్లును నియ మిస్తున్నారు.వారి దందా గురించి చెపోయాల్సిన పని లేదు.అప్పు ఇచ్చింది తామే అన్నట్లు గా వ్యవహరిస్తున్నారు..ఖమ్మం రిక్క బజార్ కు చెందిన ఒక వడ్డీ వ్యాపారి తన రికవరీ ఏజెంట్ ద్వారా బి1 లక్షఅప్పు తీసుకొన్న వ్యక్తిని 8 లక్షలు ఇవ్వాలి అని స్టాంపు కాయితం రాయించిన వైనం ఉన్నది.ఈ విషయం పై పలుమార్లు పోలీస్ స్టేషన్ లు చుట్టూ తిరిగారు.చివరికి ఫైనాసర్ అప్పు తీసుకొన్న వ్యక్తి తో పాటు.అతని గురించి ప్రశ్నించిన వ్యక్తి పైన కేసు నమోదు చేయుంచిన పరిస్థితి ఉంది.ఇటువంటి వి అనేకం ఉన్నాయి. ఇకజప్తు చేసిన ఆటోలు కోసం ఖమ్మం నగరం లో నే సుమారు 60 దొడ్లు(నిల్వ పాయింట్లు) అనదికరికంగా జన వాసాలు మధ్య ఉన్నాయి..బహిరంగంగా ఫలానా ఫైనాన్స్ సంస్థ అని బోర్డు ఉంటోంది..అన్ని ఆటోలు ఒక్క చోట ఎందుకు ఉంటున్నాయి ఫైనాన్స్ కు ఉన్న అనుమతులు ఏంటి అని పట్టించు కొన్న అధికరి లేరు.ప్రభుత్వం స్పందించి రుణాల పై మారిటోరియము విధించాలని కోరుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.