పెట్రేగిపోతున్న అక్రమ వడ్డీ, చిట్టీల వ్యాపారులు..

0
TMedia (Telugu News) :

మధిర

పెట్రేగిపోతున్న అక్రమ వడ్డీ, చిట్టీల వ్యాపారులు..

s s consultancy

-వడ్డీ డబ్బులు కట్టలేదని హోటల్లో సామాన్లు ఎత్తుకెళ్లినవ్యాపారి

.

మధిర నియోజకవర్గ కేంద్రంలో అక్రమ వడ్డీ వ్యాపారుల ఆగడాలు రోజు రోజుకీ పెట్రేగి పోతున్నాయి. ఓ పక్క లాక్ డౌన్ తో చిరు వ్యాపారులు హోటల్లు వ్యాపారం కుదేలై సతమతమవుతూ ఉంటే వడ్డీ వ్యాపారులు మాత్రం జలగల్లా పట్టిపీడిస్తున్నారు. ఈవిషయంలో బాధితులైన కొంతమంది లబోదిబోమంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే నిదానపురం గ్రామానికి చెందిన దుర్గా రెడ్డి అనే యువకుడు పట్టణంలో ని 2టౌన్ లో పద్మావతి హోటల్ మేనేజ్మెంట్ చేస్తూ హోటల్ నిర్వహణకు. గాను సాంబశివరావు అనే వ్యక్తి వద్ద రూ 6 లక్షల రూపాయలు వడ్డీ తీసుకున్నాడు. సదరు వ్యాపారి ముందు రెండు రూపాయల వడ్డీ ఇస్తే సరిపోతుంది అని చెప్పి వడ్డీ కి వడ్డీ చక్రవడ్డీ కడుతూ ఆరు లక్షలకు సుమారు 18 లక్షల వరకు ఇప్పటికే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని దుర్గా రెడ్డి అతని తల్లి ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో 2రోజుల క్రితం రెండు నెలలు వడ్డీ డబ్బులు కట్టలేదని హోటల్ లో ఉన్న సామాను సదరు వడ్డీ వ్యాపారి తీసుకు వెళ్లాడని అదేమని ఆ వ్యాపారిని ప్రశ్నించగా మీకు చేతనైంది చేసుకోండి వడ్డీ డబ్బులు కడితేనే మీ సామాన్లు ఇస్తా లేకుంటే మీ అంతు చూస్తా అంటున్నాడని దుర్గా రెడ్డి బోరున విలపిస్తున్నారు. ఈ విషయంలో తగు న్యాయం చేయాలని స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్లో. రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న జర్నలిస్ట్ లు వారిని పై విషయం పై ప్రశ్నించగా ఆవేదనతో కన్నీటి పర్యంతమయ్యారు. కాగా మధిర పట్టణంలో ఆంధ్రా నుంచి వచ్చిన వ్యక్తులు అక్రమ వడ్డీ వ్యాపారాలకు పాల్పడుతున్నారని అనేక సంఘటనలు కొంతకాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమాయకులను వడ్డీ ఊబిలో కి 2 నుంచి మెల్ల మెల్లగా ఐదు రూపాయల నుండి పది రూపాయల వరకు అక్రమ వడ్డీ వసూలు చేస్తున్నారని కొంత మంది బాధితులు వాపోతున్నారు. కొంతమంది వైట్ కలర్ ముసుగులో అక్రమ వడ్డీ వ్యాపారాలు చేపడుతుంటే మరికొంతమంది మీడియా ముసుగులో అక్రమ వడ్డీ వ్యాపారం అనుమతుల్లేని చిట్టి వ్యాపారాలు కొనసాగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది జర్నలిస్టులు కొందరి వ్యాపారంలో ఉన్న చిన్న చిన్న లోపాలు అడ్డుపెట్టుకొని ఆ వ్యాపారు లను బెదిరించి నేను వేసే ఐదు లక్షలు చిట్టి లో చేరితే మీ పైన ఎలాంటి వార్తలు రాయను లేకుంటే మీ వ్యాపారం లో ఉన్న గుట్టును రట్టు చేస్తామని బెదిరిస్తూ అనుమతుల్లేని చిట్టి వ్యాపారం అక్రమ వడ్డీ వ్యాపారాలు కొనసాగిస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తోండగా, దీనిపై అధికారులు పోలీసులు స్పందించకపోవడం విమర్శలకు బలం చేకూర్చుతోంది. కొంతమంది ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చి యథేచ్ఛగా అక్రమ వడ్డీ వ్యాపారులు కొనసాగిస్తున్నారని తక్షణమే అధికారులు అక్రమ వడ్డీ లు అనుమతులు లేని చిట్టి వ్యాపారాలపై చర్యలు తీసుకోవాలని బాధితులు ప్రజలు వేడుకుంటున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.