ఈటల రాజేందర్‌కుబీజేపీ గాలం వేసిందా..భూపేందర్ యాదవ్ చర్చలు

0
TMedia (Telugu News) :

హైదరాబాద్‌ :

తెలంగాణ మాజీ మంత్రి, కీలకనేత ఈటల రాజేందర్‌కు బీజేపీ గాలం వేసిందా..? ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించి, కాషాయ కండువా కప్పడానికి రాష్ట్ర పెద్దలు, కొందరు కేంద్రం నుంచి వచ్చిన నేతలు సన్నాహాలు చేస్తున్నారా..? అంటే తాజా పరిస్థితులను బట్టి చూస్తే అక్షరాలా నిజమనిపిస్తోంది. మంత్రి పదవి నుంచి ఈటలను బర్తరఫ్ చేసిన తర్వాత ఆయన ఏం చేయబోతున్నారు..? కాంగ్రెస్‌ గూటికి చేరుతారా లేకుంటే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా..? ఇవి రెండూ కాకుండా కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారా..? అనేదానిపై చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు పెద్దలు ఆయనతో చర్చించడం, తాజాగా బీజేపీ జాతీయ నేతే హైదరాబాద్‌కు వచ్చి చర్చలు జరపడంతో మరోసారి ఈటల రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు.

s s consultancy

సుదీర్ఘ చర్చలు!

ఈటల రాజేందర్‌తో బీజేపీ జాతీయ నేత భూపేందర్ యాదవ్ చర్చలు జరిపారు. సుమారు రెండు గంటలపాటు ఈటలతో పలు కీలక విషయాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫాంహౌస్‌లో జరిగిన ఓ సమావేశంలో ఈటలతో కలిసి బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఇదే సమావేశంలో భూపేందర్ యాదవ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ను పార్టీలోకి రావాలని బీజేపీ నేతలు ఆహ్వానించారు. అయితే బీజేపీలో చేరే అంశంపై ఈటల రాజేందర్ స్పష్టత ఇవ్వలేదు. పార్టీలోకి వస్తే కీలక పదవి ఇస్తామని కూడా చెప్పినట్లు తెలియవచ్చింది. ఈ ఆహ్వానంపై ఇంతవరకూ స్పందించని ఈటల మనసులో ఏముందో.. ఏమో మరి!.

ఇంట గెలిచాకే..!

మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వంపైనే కాకుండా, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పైనా ఎదురుదాడికి దిగుతున్న క్రమంలో ఇకపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా కొనసాగే ఉద్దేశం ఆయనకు లేదని సమాచారం. ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, టీఆర్‌ఎస్‌ నుంచి బయటికి వచ్చాక ఈటల కొత్త పార్టీ పెడతారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. కానీ, ఇంట గెలిచాకే రచ్చ గెలవాలనే ఆలోచనతో ఆయన ఉన్నారని తెలుస్తోంది. రాజీనామాతో హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక తీసుకొచ్చి, అక్కడ గెలిచి టీఆర్‌ఎస్‌కు సవాల్‌ విసరాలని, ఆపై కలిసివచ్చే వ్యక్తులు, శక్తులతో కలిసి ముందుకు సాగాలనేది ఉద్దేశంగా చెబుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.