ఈటల దారెటు.. ఊహించని ఎత్తులతో తికమక పెడుతున్న ఈటెల

0
TMedia (Telugu News) :
s s consultancy

ఈటల దారెటు.. ఊహించని ఎత్తులతో తికమక పెడుతున్న ఈటెల

టి-మీడియా/హైదరాబాద్(13):
కేబినెట్ నుంచి బర్తరఫ్‌ ఆయిన తర్వాత ఈటల రాజేందర్‌ తొందరపాటుకు గురికాకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆయన భవిష్యత్ ప్రణాళికలు ఎలా ఉంటాయి?.. కొత్త పార్టీ పెడతారా? లేదా? అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. మరోవైపు ఈటల తన ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా గెలిచేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో అధికార పార్టీలోనూ, విపక్షాల్లోనూ రాజేందర్ రాజకీయ భవితవ్యంపై ఆసక్తి నెలకొంది.
టీఆర్ఎస్‌తో పాటు ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, ప్రజా సంఘాల నేతలు ఆయన్ని కలుస్తున్నా తన ప్రణాళికలు మాత్రం ఈటల బయటపెట్టడం లేదు. దీంతో ఆయన కొత్త పార్టీ పెట్టడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొత్త పార్టీ ఏర్పాటు చేయడంలో భాగంగానే ఆయన వివిధ పార్టీల నేతలను కలుస్తున్నారని అంటున్నారు. బుధవారం ఆయన టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌తో భేటీ అయ్యారు. అదే సమయంలో ఆయన తనయుడు, బీజేపీ ఎంపీ అరవింద్‌తో కూడా ఈటల చర్చించినట్లు తెలుస్తోంది.
గత వారం రోజులుగా ఈటల రాజేందర్… మాజీ ఎంపీ కొండా విశ్వేశర్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మరో సీనియర్‌ నాయకుడు రాములు నాయక్‌తో భేటీ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కూడా ఆయన టచ్‌లో ఉన్నట్ల వార్తలొస్తున్నాయి. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల ప్రత్యర్థిగా తలపడ్డ కాంగ్రెస్‌ నేత కౌశిక్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు. అయినా కూడా ఈటలతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఈటలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారన్న వార్తలు రాగా భట్టి విక్రమార్క ఖండించారు.
అత్యంత కీలకం. అందుకే ఆయన నియోజకవర్గ గ్రామస్థాయి ప్రజాప్రతినిధులతో ఇతర నేతలతో చర్చిస్తూ తనకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న వారి గురించి ఆరా తీస్తున్నట్లు తెలిసింది.
ఇప్పటికిప్పుడు రాజీనామా చేసి ఉపఎన్నికలకు పోయే ఆలోచన ఆయనకు లేదని, ఉప ఎన్నికల్లో పార్టీ నాయకత్వం దృష్టి మొత్తాన్ని ఇక్కడే కేంద్రీకరించి తనను ఓడించడానికి అన్ని శక్తులను ఒడ్డుతుందని ఆయన భావిస్తున్నారు. అందుకే మూడేళ్ల తర్వాత జరిగే సాధారణ ఎన్నికలవైపే ఆయన మొగ్గు చూపుతున్నారని భావిస్తున్నారు. ఈలోగా తనకు మద్దతుగా వచ్చే అన్ని శక్తులను కలుపుకొని రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఈటల రాజేందర్‌ రాజకీయ పార్టీ పెట్టినా పెట్టకపోయినా ఇప్పటికిప్పుడు రాజీనామా చేసే ఆలోచన మాత్రం లేదని, అందువల్ల హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
(వెంకట్ బెజవాడ, టీ మీడియా అధికార ప్రతినిధి)

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.