ఆరుగురు మావోయిస్టులు హ‌తం!విశాఖ జిల్లాలో ఎదురుకాల్పులు

0
TMedia (Telugu News) :

ఆరుగురు మావోయిస్టులు హ‌తం!
విశాఖ జిల్లాలో ఎదురుకాల్పులు

s s consultancy

కొయ్యూరు: విశాఖప‌ట్నం జిల్లా కొయ్యూరు మండ‌లం మంప పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని తీగ‌ల‌మెట్ట‌ వ‌ద్ద‌ గ్రేహౌండ్స్ ద‌ళాలు, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందిన‌ట్లు స‌మాచారం. మావోయిస్టులు ఉన్నార‌న్న స‌మ‌చారంతో మంప పీఎస్ ప‌రిధిలో పోలీసులు కూంబింగ్ చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో తెల్ల‌వారుజామున ఇరు వర్గాల మధ్య కాల్పులు జ‌రిగాయి.

ఎవ‌రు చ‌నిపోయారు.. ఎంత మంది గాయ‌ప‌డ్డారో తెలియాల్సి ఉంద‌ని కొయ్యూరు సీఐ వెంకటరమణ తెలిపారు. ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతం కావ‌డంతో వివ‌రాలు తెలియ‌డానికి స‌మ‌యం ప‌డుతుంద‌ని వివ‌రించారు. ప్ర‌స్తుతం ఈ ప్రాంతంలో కూంబింగ్ కొన‌సాగుతోంద‌ని చెప్పారు. ఘ‌ట‌నాస్థ‌లికి అద‌న‌పు బ‌ల‌గాల‌ను త‌ర‌లిస్తున్నామ‌న్నారు. ఘ‌ట‌నాస్థ‌లిలో ఏకే- 47, తుపాకులు ల‌భ్య‌మ‌య్యాయ‌ని పోలీసులు తెలిపారు. మావోయిస్టు అగ్ర నేత‌లు త‌ప్పించుకున్నార‌న్న స‌మాచారంతో హెలికాప్ట‌ర్ సాయంతో గాలింపు చ‌ర్యలు చేప‌ట్టారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.