60లక్షల మంది పిల్లలు పరిస్థితి ఏమిటి?..తల్లిదండ్రుల్లోఆందోళన

0
TMedia (Telugu News) :

60లక్షల మంది పిల్లలు!

విద్యాసంస్థలకు అంతమంది పిల్లలొస్తే పరిస్థితి ఏమిటి?..

s s consultancy

బడులు, కాలేజీల్లో కొవిడ్‌ నిబంధనలు అమలయ్యేనా?

టీ మీడియా హైదరాబాద్ బ్యూరో..

🍥రాష్ట్రంలో విద్యాసంస్థలను జూలై 1 నుంచి ప్రారంభించుకోవొచ్చంటూ ప్రభుత్వం అనుమతించడం చర్చకు తావిచ్చింది. రాష్ట్రంలో కరోనా కేసులు పూర్తిగా అదుపులోకి రాని నేపథ్యంలో ఆన్‌లైన్‌ తరగతులకు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో నేరుగా ప్రత్యక్ష తరగతులకు సర్కారు అనుమతించడంపై విద్యాశాఖలోని ఉన్నతాధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు టీకాలు అందుబాటులోకి రాకపోవడం.. కరోనా థర్డ్‌వేవ్‌ పిల్లలకు ప్రమాదకరం అంటూ హెచ్చరికలొచ్చిన నేపథ్యంలో తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది! సర్కారు నిర్ణయంతో జూలై 1 నుంచి కేజీ టు పీజీ దాకా అన్ని రకాల విద్యాసంస్థలకు పిల్లలు హాజరయ్యే అవకాశాలున్నాయి.

🌀రాష్ట్ర వ్యాప్తంగా 1-10 తరగతులకు చెందిన పిల్లలు దాదాపు 30 లక్షల దాకా ఉంటారు. ఇంటర్‌, పాలిటెక్నిక్‌, ఐటిఐ, డిగ్రీ, ఇంజినీరింగ్‌, ఫార్మసి, పీజీ, పీహెచ్‌డీ విద్యార్థుల సంఖ్య 35 లక్షల దాకా ఉంది. ఈ లెక్కన కేజీ టు పీజీ మొత్తం విద్యార్థుల సంఖ్య రాష్ట్రంలో 65 లక్షల దాకా ఉంటుంది. ఇంజినీరింగ్‌, డిగ్రీ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు జరగకపోవడంతో వారిని మినహాయిస్తే దాదాపు 60 లక్షల మంది జూలై-1 నుంచి రోజూ ప్రత్యక్ష తరగతులకు హాజరు అవుతారు. ఒకేసారి ఇంత మందికి కొవిడ్‌ నిబంధనలు పాటించి పాఠాలను బోధించడం సాధ్యమయ్యే పనేనా? అనే అనుమానాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు గూమిగూడొద్దని, వివాహాది శుభకార్యాలకు 50కి మించి అనుమతించమని, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలంటూ ఇప్పటివరకు నిబంధనలు కఠినంగా అమలుచేసిన ప్రభుత్వం ఒకేసారి అన్ని విద్యాసంస్థలను అనుమతించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.