పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి : డిఎస్పీ వెంకటేశ్వర బాబు.

టీమీడియా బద్రాద్రి కొత్తగూడెం:

0
TMedia (Telugu News) :

ఈ రోజు జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వర బాబు ఆధ్వర్యంలో కొత్తగూడెం 3టౌన్ పోలీస్ స్టేషన్లో “పీస్ కమిటీ మీటింగ్”ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా డిఎస్పీ గారు మాట్లాడుతూ ముందుగా ముస్లిం సోదరులందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

s s consultancy

Also Read:సిబ్బందితో కలిసి గాలింపు చర్యలో పాల్గొన్న ఎస్ఐ

పండగలు అన్నింటిని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సమావేశంలో పాల్గొన్న అన్ని మతాల పెద్దలకు సూచించారు.పండుగ అనంతరం వ్యర్థాలను మున్సిపల్ అధికారుల సహకారంతో డంపింగ్ యార్డులకు తరలించడం జరుగుతుందని,అందుకు సంబంధించిన సమాచారాన్ని అధికారులకు తెలియజేయాలని కోరారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా అమలు చేస్తున్న నిబంధనలు పాటిస్తూ ప్రార్థనలను జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, 3టౌన్ సిఐ వేణుచందర్, టూ టౌన్ సిఐ సత్యనారాయణ,1టౌన్ సిఐ రాజులు పాల్గోన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.