కోవిడ్ పేటెంట్స్ తో మాట్లాడిన డిఎంఎచ్ఓ డా. సుధాకర్ లాల్

0
TMedia (Telugu News) :
s s consultancy

సివిల్ ఆసుపత్రి ఐసోలేషన్లో ఉన్న కోవిద్ పేటెంట్స్ తో మాట్లాడిన డిఎంఎచ్ఓ డా. సుధాకర్ లాల్

టీ మీడియా అచ్చంపేట మే 12: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలంలో
జిల్లా ఆరోగ్య శాఖ అధికారి డా. కె సుధాకర్ లాల్ అమ్రాబాద్ సి.ఎచ్. సి. ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఐసోలాషన్ లో ఉన్న కోవిడ్ నిర్దారణ అయిన వారితో మాట్లాడుతూ వారి ఆరోగ్య పరిస్థితిని మరియు ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల పరిధిలోని ఎల్మపల్లి గ్రామంలోని కోవిడ్ నిర్దారణ అయిన వారి ఇళ్లను సందర్శించి వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఇంట్లో ఉండటానికి ఇబ్బందిగా ఉన్నవారు అమ్రాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్లో జాయిన్ అవ్వాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు లక్షణాలు ఉన్నవారందరు ప్రభుత్వం అందించే ఐసోలేషన్ కిట్లోని మందులను వాడాలని, లక్షణాలు ఉన్నవారందరు కిట్ లోని మందులను వాడటం ద్వారా కరోన వ్యాప్తిని అరికట్టగలమని తెలిపారు. స్వీయ నియంత్రణ ద్వారా మాత్రమే కరోన వ్యాప్తిని అడ్డుకోగలమని ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి, తరచు చేతులను శుభ్రం చేసుకోవాలని, నిర్దేశిత బౌతిక దూరం పాటించాలన్నారు.
ప్రభుత్వ ఆదేశానుసారం అర్హులైన వారందరు రెండవ డోస్ వాక్సిన్ వేసుకోవాలని ఈ నెల 15వ తేదీ వరకు రెండవ డోస్ మాత్రమే వేస్తున్నామని, తర్వాత ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. శ్రీధర్, ఎల్మపల్లి గ్రామ సర్పంచ్, వైద్య అధికారులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.