మృతుల కుటుంబాలకు 25 కేజీల బియ్యం అందజేత

0
TMedia (Telugu News) :

మృతుల కుటుంబాలకు 25 కేజీల బియ్యం అందజేత

s s consultancy

టి – మీడియా/ హుస్నాబాద్ ( సిద్దిపేట జిల్లా) : మే 26

హుస్నాబాద్ మండలంలోని పందిల్ల గ్రామంలో కరోనా తో ఇటీవల ఇద్దరు మరణించగా వారి కుటుంబాలను సామాజిక సేవకురాలు మంజుల రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతినీ తెలియజేసారు.రెండు కుటుంబాలకి 25 కేజీల చొప్పున 50 కిలోల బియ్యం మరియు నిత్యావసర సరుకులు అందజేశారు.అనంతరం గ్రామంలోని గీత కార్మికులకు మాస్కులు శానిటైజర్స్ పంపిణి చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుందని రోజు రోజుకు కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని, మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటించాలని అన్నారు.అత్యావసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని, కొద్దీ రోజులు వివాహది శుభాకార్యాలయాలు వాయిదా వేసుకొంటే బాగుంటుంది అని అన్నారు. దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి లో టెస్టులు చేయించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పoచ్ తోడేటి రమేష్, మంజులక్క యువసేన సభ్యులు రవీందర్ రెడ్డి, సురేష్, పవన్, శ్రవణ్, క్రాంతి, సాయి కిరణ్, శివ కుమార్, భాను, అజయ్,గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.