మందులు పంపిణీ చేసిన సర్పంచ్ గాజుల రమేష్.

0
TMedia (Telugu News) :

మందులు పంపిణీ చేసిన సర్పంచ్ గాజుల రమేష్.

s s consultancy

టి-మీడియా/కోహెడ(సిద్దిపేట జిల్లా)మే 09

సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని కురెళ్ళ గ్రామంలో ఆదివారం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కరోనా కట్టడికి కూరేళ్ళ గ్రామ పంచాయతీ పరిధిలో ఇంటింటికి వెళ్లి జ్వరం,జలుబు,దగ్గు,కోవిడ్ లక్షణాలు ఉన్న వారి వివరాల కోసం ఏఎన్ఎం ,ఆశావర్కర్లు అంగన్ వాడి సిబ్బందితో కలిసి జ్వర సర్వే కార్యక్రమం లో హెల్త్ కిట్లను పంపిణీ చేసిన సర్పంచ్ గాజుల రమేష్.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..కూరేళ్ళ గ్రామంలో స్వల్ప లక్షణాలు ఉన్న వారికి 11 మందికి ఐదు రకాల మందులు పంపిణీ చేయడం జరిగింది అని.. అలాగే గ్రామంలో ఇంక ఎవరికైనా జ్వరం కానీ దగ్గు జలుబు కానీ ఉన్నట్లు అనిపిస్తే గ్రామ సర్పంచ్ కి తెలియ చేయాలని….. వారికి వెంటనే ఐదు రకాల మందులు పంపియడం జరుగుతుంది అని చెప్పారు.జ్వరం వస్తే బయపడి కొందరు చెప్పక పోవడం వల్లనే కరోన అనేది సీరియస్ వ్యాప్తి చెందుతున్నారు గత రెండు రోజులుగా జ్వరం వచ్చిన వారిని గుర్తించి వారికి కిట్లు ను ఇస్తున్నాము అని చెప్పారు.అలాగె రేపటి నుండి గ్రామంలో ఎవరైనా మస్కులు ధరించకుంటే కచ్చితంగా ఫైన్ వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మస్కు ధరించి అత్యవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి అనవసరంగా బయట తిరిగి ఇంట్లో వాళ్ళను ఇబ్బందులకు గురిచేయవద్దు అని కోరారు.తెలంగాణ లో కరోన రక్కసిపై రాష్ట్ర ప్రభుత్వం భీకర యుద్ధం ప్రకటించిందని అందులో భాగంగానే ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహించే బృహత్తర కార్యక్రమం చేపట్టిందని తెలిపారు.గ్రామ ప్రజలందరూ సమగ్ర ఆరోగ్య జ్వర సర్వేకు సహకరించాలని పాజిటివ్ కేసులు మరియు కరోనా లక్షణాలు గల నెగిటివ్ పేషంట్స్ పై దృష్టి పెడితే కరోనా నియంత్రణలోకి వస్తుందని,ప్రజలు ఎవరూ భయబ్రాంతులకు గురికావద్దని,కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి హోం ఐసోలేషన్ అవసరం ఉన్న వారికి వెంటనే హెల్త్ కిట్లు అందజేస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గాజుల రవీందర్ ఏఎన్ఎం ఎలిశాగారు ఆశావర్కర్లు వసంత అంజలి జ్యోతి అంగన్వాడీ టీచర్లు ముత్యాలు శారదా మరియు గ్రామ ప్రజలు చిట్యాల లింగయ్య ఇట్ట వెని కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.