బాల్కొండలో వైద్య పరికరాలు అందజేత

0
TMedia (Telugu News) :

బాల్కొండలో వైద్య పరికరాలు అందజేత

s s consultancy

బాల్కొండ మండల కేంద్రములో గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో ఈరోజు 10-5-2021 సోమవారం కరోన వ్యాధిని నివారణ చర్యల్లో భాగంగా పల్స్ ఆక్సమిటర్లు-12,థర్మల్ స్కానర్-12 వైద్య పరికరాల కిట్లను సర్పంచి బూస సునీత,ఉపసర్పంచ్ షేక్ వాహబ్ చేతుల మీదుగా ఆశ కార్యకర్తలకు అందజేయడం జరిగింది.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కరోన వ్యాధిని నివారించేందుకు ఇంటింటా సర్వేలో భాగంగా అవసరమైన వైద్య పరికరాలను గ్రామ పంచాయితీ పాలకవర్గం ఆధ్వర్యంలో సుమారు రూ40 వేలు వ్యాయంతో కూడిన పల్స్ ఆక్సమిటర్లు-12,థర్మల్ స్కానర్-12 కిట్లు ఆశ కార్యకర్తలకు అందజేయడం జరిగిందని అన్నారు.గత కొన్ని రోజులుగా బాల్కొండ మండల కేంద్రంలో కరోన వ్యాధి నివారించేందుకు సర్వే నిర్వహిస్తున్నామని కరోన వ్యాధి బారిన పడినవారు లేదా ఎలాంటి లక్షణాను కనబడినా ప్రభుత్వ ఆసుపత్రికి లేదా ఆశ కార్యకర్తలకు సమాచారం ఇవ్వాలని దానికి సంబంధించిన మందులు ఇవ్వడం జరుగుతుందని వారు సూచించారు

ఈకార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కానూర్ గంగాధర్,టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యా సాగర్,తెరాస నాయకులు బూస నరహరి,దివాన్ వెంకటేష్ వార్డు సభ్యులు సయ్యద్ రియాజ్ అలీ,మార పురుషోత్తం,ఆశ కార్యకర్తలు,అంగన్ వాడి టీచర్లు గ్రామ పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.