కోవిడ్ బాధితులకు పండ్లు అందజేత…

0
TMedia (Telugu News) :

కోవిడ్ బాధితులకు పండ్లు అందజేత…
సహాయకారుల వినూత్న ఆలోచన…
రూ.6000 లు వ్యయం…

s s consultancy

టీ మీడియా ప్రతినిది – అశ్వారావుపేట:

నాడు పుర్రెకో బుద్ది – జిహ్వకో రుచి అన్నారు మన పూర్వీకులు.నేడు మనసులో ఆలోచన – మనిషికో ఆశయం అంటున్నారు ఆధునిక సామాజిక స్ప్రుహ ఉత్సాహవంతులు.ఏదైనా సామాజ హితం కోరే ఎం చిన్న అంశం అయినా దానికో గుర్తింపు,ప్రత్యేకత అనివార్యం.
విషయం ఏమిటంటే….అశ్వారావుపేట పట్టణానికి చెందిన కొందరు “ఏక్టివ్ పర్సన్స్ ” సమాజానికి ఎంతో కొంత ఉడతా భక్తి సహాయం చేద్దాం అనుకున్నారు.అనుకున్నదే తడవుగా ముందుగా వారి స్తోమతను బట్టి తలాకొంత ఆర్ధికాన్ని సమకూర్చుకున్నారు.ఇలా సమకూర్చిన మొత్తం రూ. 6000 లు కావడంతో స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులు 15 మందికి,వైద్యారోగ్య సిబ్బందికి మొత్తం కలుపుకుని 52 మంది పండ్లు అందజేద్దామనుకున్నారు.ఈ క్రమంలో ఆదివారం సామాజిక సేవా కార్యకర్త భోగవల్లి రాంబాబు, టి.న్యూస్ మీడియా ప్రతినిధి సరిదే సాయి దుర్గారావు లు ఏపిల్,దానిమ్మ పండ్లను కొనుగోలు చేసి డాక్టర్ వెంకటేశ్వర్లు కు ఆసుపత్రిలో అందజేసారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.