ఎమ్యెల్యే చేతులు మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

0
TMedia (Telugu News) :

ఎమ్యెల్యే చేతులు మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

s s consultancy

టీమీడియావైరా ప్రతినిధి:

స్థానికఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నందు కొణిజర్ల మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోసూరి శ్రీనివాసరావు గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మండలం లోని వివిధ గ్రామాలకు చెందిన 34 మంది లబ్ధిదారులకు సుమారు తొమ్మిది లక్షల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ముఖ్య అతిథిగా వైరా శాసనసభ్యులు శ్రీ లావుడ్యా రాములు నాయక్ లబ్ధిదారులకు గురువారం అందజేశారు.ఈ సందర్బంగా ఎమ్యెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు రాష్ట్ర ప్రజల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను చేపడుతున్నారని తెలంగాణ ప్రజల శ్రేయస్సుకోసం అహర్నిశలు కష్టపడుతూ ఆరోగ్యం బాగోలేక ప్రైవేటు దావాఖానలలో చికిత్స చేయించుకుని ఆర్థికంగా నష్టపోయిన వారి కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వారిని ఆదుకునే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు మీకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రమాదంగా ఉందని అందువలన ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తూ తమ ఆరోగ్యంతో పాటు సమాజ శ్రేయస్సును కూడా కాపాడుకోవాలని తద్వారా రాబోయే రోజుల్లో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు.రాబోయే రోజుల్లో ప్రతిఒక్కరు రాష్ట్ర ప్రభుత్వానికి టిఆర్ఎస్ పార్టీకి అండదండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మార్కెట్ కమిటీ ఛైర్మన్ గుమ్మా రోశయ్య, ఎంపీపీ గోసు మధు,జడ్పీటీసీ పోట్ల కవిత, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, ఏన్కూర్ మండల పార్టీ అధ్యక్షులు బాణోత్ సురేష్, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు మెడ ధర్మారావు,సర్పంచ్ల సంగం మండల అధ్యక్షులు చల్లా మోహన్ రావు,మండల నాయకులు అంబెడ్కర్, కొనకంచి మోషే,రచ్చ రామ కోటయ్య, కనగంటి రావు,గూడూరు కృష్ణ రెడ్డి,నానయ్య,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.