బిజెపి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ

0
TMedia (Telugu News) :

బిజెపి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ

s s consultancy

టీ – మీడియా/ హుస్నాబాద్ ( సిద్దిపేట జిల్లా) : మే 30

ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 7 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా రాష్ట్ర బిజెపి అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా బిజెపి అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి అదేశాల మేరకు “సేవ హి సంఘటన్” కార్యక్రమంలోభాగంగా ఆదివారం కోహెడ మండల కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికులకు, ఆశ వర్కర్, అంగన్వాడీ ఆయా కుటుంబాలకు రెండు మూడు రోజులకు సరిపడా సన్న బియ్యం, 15 రకాల నిత్యావసర సరుకులను కోహెడ మినాక్ష్మి షాఫింగ్ మాల్ ప్రోప్రేటర్ బైరినేని సుకుమార్ రావు సహకారంతో ఎంపీటీసీ, బిజెపి మండల అధ్యక్షులు ఖమ్మం స్వరూప వేంకటేశం బిజెపి శ్రేణులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఆర్థికంగా బలమైన కుటుంబం మాది కానప్పటికీ కోవిడ్ సమయంలో ప్రజలకు నిరంతరం సేవచేస్తున్న పారిశుద్ధ్య ,ఆశ, అంగన్వాడీ ఆయా కుటుంబాలకు ఉడుత భక్తిగా సహాయం అందించాలనే సంకల్పంతో మా మిత్రుడు మినాక్ష్మి షాఫింగ్ మాల్ ప్రోప్రేటర్ బైరినేని సుకుమార్ ద్వారా సహకారాన్ని తీసుకొని కార్యక్రమం చేపట్టామని సహకారాన్ని అందించిన ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోగ్రామ్స్ ఇంఛార్జీలు బొమ్మగాని శివకుమార్, గుగ్గిళ్ల శ్రీనివాస్, చేను తిరుపతి, కంది సత్యనారాయణ రెడ్డి, సుంకరి రవి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.