రోటరీ క్లబ్ .సహకారంతో ఆక్సిజన్ కాన్సoట్రేటర్లు పంపిణీ:ఎమ్మెల్యే

0
TMedia (Telugu News) :

రోటరీ క్లబ్ .సహకారంతో ఆక్సిజన్ కాన్సoట్రేటర్లు పంపిణీ:ఎమ్మెల్యే సంజయ్ కుమార్

s s consultancy

టీ మీడియా ప్రతినిధి,జగిత్యాల జిల్లా,మే 23

జిల్లాలోని స్థానిక కొత్త బస్టాండ్ సమీపంలోని మంచాల కృష్ణ అండ్ సన్ వారి
భారత్ పెట్రోల్ పంపు 70వ వార్షికోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ రెడ్ క్రాస్ సహకారంతో మరోక సామాజిక కార్యక్రమం చేపట్టిందని,ప్రధానంగా కోవిడ్ బాధితులకు ప్రస్తుత పరిస్థితులలో ఆక్సిజన్ అవసరం దృష్ట్యా 2 లక్షల రూపాయల విలువగల 4 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను జగిత్యాల ప్రజల అవసరంకోసం అందించారు.వీటిలో రెండు
ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను
ప్రభుత్వ ఆసుపత్రికి ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ చేతుల మీదుగా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆర్ఎంఓ డా.వి రామకృష్ణకు అందజేశారు.మరో రెండు కాన్సంట్రేటర్లు ఆక్సిజన్ అత్యవసరమైన వారికి ఉపయోగించడానికి వీలుగా తమ రోటరీ క్లబ్ ఆఫ్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఉండనున్నాయని భారత్ పెట్రోల్ పంపు నిర్వాహకులు మంచాల కృష్ణ,రోటరీ అసిస్టెంట్ గవర్నర్ సిరిసిల్ల శ్రీనివాస్,టివిసూర్యం తెలిపారు.అలాగే 2000 మాస్కులను,ఒక వంద మంది లాక్ డౌన్ సమయంలో ఇబ్బంది పడుతున్న వారికి నిత్యావసర సరుకులను అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మాట్లాడుతూ భారత్ పెట్రోల్ పంపు ఏర్పాటు చేసి,70 సంవత్సరాలలో అడుగిడుతున్న సందర్భంగా నిర్వాహకులు మంచాల కృష్ణ అండ్ సన్ కు శుభాకాంక్షలు తెలిపారు.ప్రస్తుత కరోనా పరిస్థితులలో కరోనా బాధితులకు అవసరమైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందిస్తుండడం పట్ల అభినందనలు తెలిపారు.ప్రజోపయోగమైన కార్యక్రమాలు చేయడంలో రోటరీ ఆఫ్ రెడ్ క్రాస్ ముందుంటుందనీ,గత లాక్ డౌన్ సమయంలో కూడా తమవంతు బాధ్యతలను నిర్వర్తించిందని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ తో పాటు మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి, డా.రామకృష్ణ,డా.ధీరజ్ రావు,రోటరీ ఆఫ్ రెడ్ క్రాస్ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్,టివి సూర్యం,పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టు సతీష్,కౌన్సిలర్లు,వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,కౌన్సిలర్లు దాసరి లావణ్య ప్రవీణ్,కూతురు రాజేష్,అల్లే గంగసాగర్,ముస్కు నారాయణరెడ్డి,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.