యువ ఫౌండేషన్ ఆలో పండ్లు పంపిణీ

0
TMedia (Telugu News) :
s s consultancy

యువ ఫౌండేషన్ ఆలో పండ్లు పంపిణీ

వేములవాడ పట్టణానికి చెందిన యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేములవాడ లోని యాచకులకు, నిరాశ్రయులకు దాదాపు 100 మందికి పండ్లు పంపిణీ చేయటం జరిగింది.ఈ సందర్బంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు కానిస్టేబుల్ గొడిశెల రాజశేఖర్ మాట్లాడుతూ లాక్ డౌన్ కారణం గా పేదలకు తమ వంతుగా సహాయం చేయాలనే ఉద్దేశ్యం తో అన్నదానం,మజ్జిగ, పండ్లు పంపిణీ చేస్తునట్టు తెలిపారు.కరోనా కారణం గా యాచకుల కు కూడా పౌష్టిక ఆహారం అందించాలనే ఉద్దేశ్యం తో పండ్లు అందిస్తున్నట్టు తెలిపారు. వేములవాడ రాజ రాజేశ్వర స్వామి ని నమ్ముకొని వచ్చిన యాచకులకు లాక్ డౌన్ కారణం గా భక్తులు రాకపోవటం తో వేములవాడ మున్సిపల్, దేవాలయం వారు భోజన వసతి ఏర్పాటు చేయటం మరియు పట్టణం లో చాలా మంది దాతలు ముందుకు వచ్చి అన్నదానం చేయటం అభినందనీయం అన్నారు.ఎవరైనా యువ ఫౌండేషన్ ద్వారా సహాయం చేయాలి అనుకుంటే ఫౌండేషన్ ని సంప్రదించండి అని, ఫౌండేషన్ కి సహకరిస్తున్న ప్రతీ ఒక్క దాతకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో యువ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ గడ్డం ప్రశాంత్,సభ్యులు పర్శరాము, ఏండ్రాల మహేష్, దూలం రామ్ కుమార్, సాయి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.