పేదింటి ఆడబిడ్డలకు వరం కళ్యాణవరం;ఎమ్మెల్యే

0
TMedia (Telugu News) :

పేదింటి ఆడబిడ్డలకు వరం కళ్యాణవరం;ఎమ్మెల్యే

టి మీడియా/వరంగల్
ప్రతినిధి /జూన్ 5:

s s consultancy

నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి పథకం వరంలా మారిందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.. శివనగర్ క్యాంప్ కార్యాలయంలో 27 డివిజన్ కి చెందిన 16,01,856 రూపాయల విలువగల 16 కళ్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారు లబ్దిదారులకు పంపిణీ చేశారు..

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడభిడ్డ పెళ్ళి బారంగా మారకుండా తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లక్ష రూపాయల సాయం అందజేస్తున్నారన్నారు..కళ్యాణలక్ష్మి పేదలకు వరంగా మారిందని,దేశంలోనే పేదలకు అనేక సంక్షేమ ఫలాలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణా అన్నారు..కరోనా కష్టకాలంలో సైతం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడాదనే ఉద్దేశ్యంతో సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం ప్రజలకు అందిస్తుందన్నారు..

ఈ కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్ జారతి రమేష్,మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ టీ.రమేష్ బాబు డివిజన్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.