బీజేపీ ఆధ్వర్యంలో నిరుపేదలకు పండ్ల పంపిణీ

0
TMedia (Telugu News) :

బీజేపీ ఆధ్వర్యంలో నిరుపేదలకు పండ్ల పంపిణీ

s s consultancy

టీ – మీడియా/ హుస్నాబాద్ ( సిద్దిపేట జిల్లా) : మే 30

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో ఆదివారం మండల కార్యదర్శి చెరుకు సంపత్, మండల ఉపాధ్యక్షుడు దాసరి కృష్ణ ఆధ్వర్యంలో కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్కులు పండ్ల వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెన్సార్ బోర్డు నెంబర్ మండలం ఇంచార్జ్ లక్కిరెడ్డి తిరుమల హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రధానిగా నరేంద్రమోడీ 7 సంవత్సరాలు దేశ ప్రధానిగా పదవి కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా బిజెపి రాష్ట్ర, జిల్లా పార్టీ పిలుపు మేరకు సేవా హి సంఘటన కార్యక్రమంలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మాస్కులు, పండ్ల వితరణ చేపట్టామని తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ ఎవరికి వారు స్వీయ నిర్బంధంలో ఉండాలని కార్యకర్తలు ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలలో పాలుపంచుకోవాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ణకంటి నరేష్, బీజేవైఎం మండల అధ్యక్షుడు కొయ్యడ కార్తీక్, మండల కార్యవర్గ సభ్యుడు జంగా పెళ్లి తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.