కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

0
TMedia (Telugu News) :

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

s s consultancy

టీ మీడియా// సిద్దిపేట// మే 15

సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని మంగోల్ గ్రామములో అర్హులైన ప్రజలకి కళ్యాణ లక్ష్మి చెక్కులను సర్పంచ్ కిరణ్ అందించారు. రాష్ట్ర ముఖ్య మంత్రి కె సి ఆర్ ఒకవైపు కరోనా సంక్షోభం తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిన ప్రజా సంక్షేమ పథకాలను యథా విధంగా కొనసాగిస్తున్నారని ,ఇది ప్రజా ప్రభుత్వం అని,కుల మతాల అతీతంగా అన్ని వర్గాల ప్రజలకి ప్రభుత్వం చేయూతను అందిస్తుందని , పేద ప్రజలు తమ పిల్లలకి పెళ్లి చెయ్యడానికి చాలా ఇబ్బందులు గతంలో పడేవారని వారికి కళ్యాణ లక్ష్మి పథక నిధులు ఒక వరంగా మారాయని మంగోల్ సర్పంచ్ కిరణ్ అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ వార్డ్ సభ్యులు , అధికారులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.