కరోనా భాదితులకు నిత్యావసర సరుకుల పంపిణీ

0
TMedia (Telugu News) :
s s consultancy

కరోనా భాదితులకు నిత్యావసర సరుకుల పంపిణీ

టి – మీడియా/ హుస్నాబాద్ ( సిద్దిపేట జిల్లా) : మే 13
సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని పెద్ద సముద్రాల గ్రామంలో ఇటీవల కరోనా బారిన పడినబాధితులకు అదే గ్రామానికి చెందిన గుండ ప్రభాకర్ టీఆరెస్ పార్టీ సీనియర్ నాయకుడు గురువారం రోజున తన సొంత ఖర్చుతో నిత్యావసర సరుకులు సింగిల్ విండో డైరెక్టర్ గుండ తిరుపతి గారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనాకు భయపడవద్దని కరోనా నిర్ధారణ కాగానే ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోవద్దని ప్రభుత్వ సలహాలు, వైద్యుల సూచనల మేరకు ఈ మహమ్మారిని పది రోజుల్లోనే జయించవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ మాదిగ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వేల్పుల భాస్కర్, కొండని సురేష్, వార్డు సభ్యులు గుండ రమేష్,,వేల్పుల బాలమని, ఆశ వర్కర్ యాదవ్వ ,పద్మ, టీటీడీపీ నాయకులు సింగరయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకర్ , సీపీఐ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పోలోజు కృష్ణామా చారి తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.