గుత్తి కోయలకు నిత్యావసర వస్తువులు అందజేసిన ములుగు ఏఎస్పి

0
TMedia (Telugu News) :

గుత్తి కోయలకు నిత్యావసర వస్తువులు అందజేసిన ములుగు ఏఎస్పి పోతరాజు సాయి చైతన్య ఐపిఎస్

s s consultancy

టీ – మీడియా మే 26
ములుగు జిల్లా ప్రతినిధి

బుధవారం రోజున ఉదయం గౌరవనీయులైన ములుగు ఏ ఎస్ పి శ్రీ పోతరాజు సాయి చైతన్య ఐపిఎస్ గారు జగ్గన్నపేట గ్రామ సమీపంలో నివసించే బొడ రామయ్య గుంపుకు చెందిన గిరిజనులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. సుమారు 16 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి సుమారు10 కిలోల బియ్యం,5 కిలోల కూరగాయలు,నూనె, పప్పులు మరియు నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏ ఎస్పీ శ్రీ సాయి చైతన్య గారు మాట్లాడుతూ గిరిజనులకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారికి చేయూతనందించడంలో ముందు ఉంటుందని తెలిపారు. అనంతరం వారి కుటుంబాలతో మాట్లాడుతూ గిరిజనుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ములుగు సిఐ శ్రీ గుంటి శ్రీధర్ గారు, ఎస్ఐ శ్రీ ఓంకార్ యదవ్, ప్రొబేషనరీ ఎస్సై రాధిక మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారుగుత్తి కోయలకు నిత్యావసర వస్తువులు అందజేసిన ములుగు ఏఎస్పి పోతరాజు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.