తడిసిన ధాన్యాన్నికొనుగోలుచేయ్యలి

0
TMedia (Telugu News) :

తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి, రైతులను ఆదుకోవాలని MCPIU జిల్లా కార్యదర్శి సబ్బని కృష్ణ డిమాండ్ చేశారు.

s s consultancy

(టీ) మీడియా ప్రతినిధి :-మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి మే (21)

జిల్లా లోని రైతులు వరి ధాన్యాన్ని పండిస్తే పండించిన పంటని సకాలంలో ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలైన మార్కెట్ యార్డులు తదితర సంస్థలు కొనకపోవడం వల్ల అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దలవుతుంది పండించిన రైతు గుండె కన్నీరు మున్నీరు అవుతుంది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించి తడిసిన ధాన్యాన్ని కొనాలని, తేమ పేరుతో, తాలు పేరుతో రైతులకు అన్యాయం చేయవద్దని, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా రైతు ఉద్యమాలను చేస్తామని తెలియజేస్తున్నాము, ఈ కార్యక్రమంలో MCPIU నాయకులు సబ్బని ఆకాష్ కుమార్, కొప్పర్ల కృష్ణ వంశీ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.