18 సంవత్సరాలు నిండిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ వేయాలి..మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)

0
TMedia (Telugu News) :

18 సంవత్సరాలు నిండిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ వేయాలి…. టిడిపి జాతీయ కోశాధికారి & మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)గారు

s s consultancy

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం 18 సంవత్సరాలు నిండిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ వేయాలి ప్రజల ప్రాణాలు కాపాడాలి అనే నినాదంతో ఈరోజు జగ్గయ్యపేట పట్టణంలో మాజీ శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్యగారు పార్టీ కార్యాలయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు

ఈ సందర్భంగా తాతయ్య గారు మాట్లాడుతూ

జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం అసమర్ధతకు నేడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి కబళించి వేస్తున్న ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్న వైరస్ కట్టడి పై ముఖ్యమంత్రి దృష్టి పెట్టకుండా కేవలం ప్రతిపక్షాన్ని అణచి వేయడం, వేధించడం పైనే శ్రద్ధ చూపడం కరోనా ను మించిన విషాదం. కరోనాపై పోరులో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడం వల్లనే ఇంతటి విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి ఏపీ క్యాబినెట్ అజెండాలో కరోనాను 33 వ అంశంగా పెట్టడాన్ని బట్టి ప్రజల ప్రాణాలపై జగన్మోహన్ రెడ్డికి ఎంత చిత్తశుద్ది ఉందో అర్థం అవుతోంది. ముఖ్యమంత్రి వైరస్ ను మించిన ప్రమాదకారి కాబట్టే కరోనా అంశాన్ని చిట్టచివర పడేశారు. రోడ్లపైనే ప్రజల ప్రాణాలు పోతుంటే మీకు లెక్క లేదా శవాల దిబ్బల పై రాజ్యమేలుదాము అనుకుంటున్నారా? పొరుగు రాష్ట్రాలు టీకా కొనుగోలుకు పోటీ పడుతుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రత్యర్థులపై రాజకీయ కక్ష తీర్చుకోవడానికి పోటీ పడుతున్నారు. 18 ఏళ్లు దాటిన వాళ్లకి వ్యాక్సిన్ ఉచితంగా వేస్తామని చెప్పి ఇప్పుడు మడమ తిప్పుతారా? ప్రజలందరికీ టీకా అందించేందుకు 1600 కోట్లు కేటాయించలేరా? క్యాబినెట్ సమావేశంలో కేవలం 45 కోట్లతో 13 లక్షల వ్యాక్సిన్లను మాత్రమే కొనాలని నిర్ణయం తీసుకోవడం దారుణం. ఐదు కోట్ల జనాభాకు 13 లక్షల వ్యాక్సిన్లు ఎలా సరిపోతాయి? ప్రభుత్వ భవనాల పై మీ పార్టీ రంగుల కోసం మూడు వేల కోట్లు దుబారా చేశారు మీ సలహాదారులకు నెల జీతం రూపంలో వందల కోట్లు వృధా చేస్తున్నారు కదా. సాక్షి పత్రికకు ప్రకటనల రూపంలో వందల కోట్ల ప్రజాధనం దోచి పెట్టారు. వ్యాక్సిన్ కు మాత్రం డబ్బులు లేవా? ఆస్పత్రుల్లో రోగుల ఆర్తనాదాలు సమయానికి వైద్యం అందని మరణాలు అందర్నీ కలచివేస్తున్నాయి ఆ హృదయ విదారక దృశ్యాలు చూసైనా జగన్మోహన్ రెడ్డి మనసు కరగడం లేదు. 420 నుంచి 500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నామని ప్రభుత్వం చెప్పడం వల్ల ఏమి ఉపయోగం? సకాలంలో ప్రాణవాయువు అందక ప్రతిరోజు రోగులు చనిపోతూనే ఉన్నారు. విజయనగరం కర్నూలు అనంతపురం ఆస్పత్రిలో జరిగిన ఘటనల నుంచి ప్రభుత్వం ఇంకా పాఠాలు నేర్చుకోలేదు. కరోనా మొదటి దశలో ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవలను ఉపయోగించుకుని జీతాలు ఇవ్వకుండా వెళ్లగొట్టారు ప్రభుత్వ నిర్వాకం వల్ల సెకండ్ వేవ్ లో విధుల్లో చేరేందుకు సిబ్బంది జంకుతున్నారు. నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ కార్డుదారులకు నో ఎంట్రీ అంటున్నాయి. ప్రాణాలకు తెగించి కరోనా చికిత్స చేసిన వైద్యులను పిచ్చివాళ్లు గా ముద్ర వేశారు పారిశుద్ధ్య కార్మికులకు కనీసం రక్షణ పరికరాలు ఇవ్వడంలేదు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ససేమిరా అంటున్నారు. ప్రజలకు 24 గంటల పాటు అందుబాటులో ఉంటుందన్న 104 కాల్ సెంటర్ ల వల్ల ప్రజలకు ఎటువంటి ప్రయోజనం చేకూరడం లేదు.
కరోనాతో బాధపడుతున్న ఒక్క రోగికైనా ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, ఎమ్మెల్యేల వరకు ఎవరూ సాయం అందించిన దాఖలాలు లేవు మీ చావు మీరు చావండి అనే ధోరణిలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినే వైసీపీ ఎమ్మెల్యే లు అనుకరిస్తూన్నారు. ఇప్పటికైనా తమ తీవ్రమైన తప్పిదాలను కప్పి పెట్టడం మానండి. ప్రతిపక్షాల సలహాలు, శాస్త్రవేత్తలు ఇచ్చే సలహాలు, కోర్టులు చేస్తున్న సూచనలు పాటించండి. కరోనా మృతుల కుటుంబాలకు చంద్రన్న బీమా ఉంటే 10 లక్షల పరిహారం వచ్చి ఉండేది కోవిడ్ మృతుల అంత్యక్రియలకు 35 వేలు వచ్చి ఉండేవి. 18-45 సంవత్సరాల యువతకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలనే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను జగన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి కరోనా వ్యాక్సిన్ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అని తాతయ్య గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.