మెడికల్ కళశాల ఏర్పాటు కోసంఫైట్ ఫర్ బెటర్ సొసైటీ దీక్ష

0
TMedia (Telugu News) :

మెడికల్ కళశాల ఏర్పాటు కోసంఫైట్ ఫర్ బెటర్ సొసైటీ దీక్ష

s s consultancy

టి-మీడియా ప్రతినిధి/గోదావరిఖని ;మే 24

గోదావరిఖని ప్రజల చిరకాల కోరిక మెడికల్ కళాశాల, ఎన్నికలు రాగానే ప్రజాప్రతినిధులకు గుర్తు వచ్చేది వైద్య కళాశాల వారి మెనిఫెస్ట్లో మోదటి అంశం ఇదే ఉంటుంది, కానీ అమలుకు నిచుకోదు, ఇచ్చిన హామీ ప్రకారం ఖనిలో కచ్చితంగా మేడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నాయకులు ఇంటివద్ద ప్ల కార్డులతో దీక్ష చెపట్టి నిరసన తెలిపారు.మద్దెల దినేష్,గడప శ్రీకాంత్, కొమ్మ చందు యాదవ్,లు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి హామీ ఇచ్చి నేడు దానిని తుంగలో తొక్కి ఈ ప్రాంతం పై పూర్తిగా వివక్ష చూపుతూ ఇంకో ప్రాంతానికి మెడికల్ కళాశాలను తరలించడాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు.కేవలం ఇక్కడి ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్య కారణంగానే మెడికల్ కళాశాల గోదావరిఖని కి మంజూరు కావడం లేదని ఆరోపించిరు.ఎప్పుడు ప్రభుత్వ పేద్దలతో ఫోటోలు దిగడమే తప్ప ఈ ప్రాంత ప్రజలకు ఏమి కావాలో తేలుసుకోవడంలో పూర్తిగా ప్రజాప్రతినిధులు విఫలం అయ్యారు అని అన్నారు. గతంలో మెడికల్ కళాశాల మంజూరు కోసం స్థల సేకరణ కూడా చేసి గాలికొదిలేసారన్నారు.
ఈ ప్రాంత ప్రజలు నాణ్యతమైన వైద్యనికి నోచుకోవడం లేదని వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తుంటే మార్గ మధ్యలొనే దురదృష్టవశాత్తు వల్ల మృత్యువాత పడుతున్నారన్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏది ఏమైన కార్మిక క్షేత్రంలో మేడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని ఈ కోల్సిటీని పూర్తిగా హెల్త్ సిటీగా మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రభుత్వం పునరాలచొన చేసి గోదావరిఖనిలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి స్థానిక ప్రజానికాం చిరకాల కోరిక ను తీర్చాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రమేష్ కుమార్,శ్రవణ్,అనిల్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.