కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో సత్యగ్రహ దీక్ష.

0
TMedia (Telugu News) :

కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో సత్యగ్రహ దీక్ష.

s s consultancy

ఆదిలాబాద్ జిల్లా:జూన్(7)

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో దారిద్య రేఖకు దిగువనున్న కుటుంబాల అన్నిటికీ కరోనా మరియు బ్లాక్ ఫంగస్ చికిత్స ఉచితంగా ప్రభుత్వం చేయించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపుమేరకు కాంగ్రెస్ నాయకులు సోమవారం సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారి నివాసంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలోకాంగ్రెస్ పార్టీ నాయకులు మునిగేలనర్సింగ్, మల్లేష్ యాదవ్,సాదిక్, సృజన్ రెడ్డి, ఏంఏ షకీల్, రాజు యాదవ్, మల్లేష్ యాదవ్, అజిజ్ ,చంద్రాల రాహుల్,విజయ్,సంతోష్ , అస్బాత్ ఖాన్ ,ఖుర్షీద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ దేశంలోనూ, రాష్ట్రంలో కరోనా బ్లాక్ ఫంగస్ విజృంభిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. వైద్యం కోసం పేదలు ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడి ముఖ్యమంత్రి కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చారని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో మాటల తప్ప చేతల్లో ఏమీ లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.