వరి ధాన్యంకొనుగోలు ప్రారంభించి నసొసైటీ అధ్యక్షుడు

0
TMedia (Telugu News) :
s s consultancy

మీడియా చింతకాని. మండల పరిధిలోని నాగులవంచ గ్రామం లో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం అధ్యక్షుడు నల్లమోతు శ్రీనివాసరావు వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగులవంచ సహకార సంఘం ఆధ్వర్యంలో పాతర్ల పాడు, చిన్న మండవ, తిమ్మినేనిపాలెం, నాగులవంచ గ్రామాల రైతుల వరిపంటను సహకార సంఘం ద్వారా కొనుగోలు చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగులవంచ పంచాయతీ సర్పంచ్ ఆలస్యం నాగమణి, సొసైటీ డైరెక్టర్ వంకాయలపాటి సత్యం, యరధేశిగోపాల్ వ్యవసాయ విస్తరణ అధికారి హరికృష్ణ గ్రామ రైతు ఆలస్యం బసవయ్య గోపాలరావు నెల్లూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.