సాగు సమస్యలపై జూన్‌ 11న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు..తెలంగాణ రైతు సంఘం

0
TMedia (Telugu News) :

వానాకాలం సాగు సమస్యలపై జూన్‌ 11న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు

s s consultancy
  • తెలంగాణ రైతు సంఘం పిలుపు
    వానాకాలం సాగు సమస్యల పరిష్కరించాలని జూన్‌ 11న రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ మండల, డివిజన్‌, జిల్లా కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించి వినతిపత్రాలు ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటి పిలుపు నిచ్చింది.
    సంఘం రాష్ట్ర కార్యాలయం(ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర)లో జరిగిన విలేకరుల సమావేశంలో అఖిల భారత కిసాన్‌ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌, సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ… జూన్‌1 నుండి వానాకాలం పంటల సీజన్‌ ప్రారంభమైంది. ఇప్పటికే కొన్ని చోట్ల మెట్ట పంటలు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు వ్యవసాయ ప్రణాళిక, రుణ ప్రణాళిక విడుదల చేయలేదు. రైతులు విత్తనాల కొరకు ఆందోళన చెందుతున్నారు. కల్తీ విత్తనాల బెడద తీవ్రంగా ఉంది. క్వింటాళ్ళ కొద్ది కల్తీ విత్తనాలు పట్టుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అందుకు తగిన విత్తనాలు మండల కేంద్రాలలో అందుబాటులో లేవు. దీనిని అవకాశంగా తీసుకొని కల్తీ వ్యాపారులు దందా సాగిస్తున్నారు. పాలకూర నుండి పత్తి విత్తనాల వరకు కోట్ల రూపాయలలో విత్తనాలు పట్టుబడినట్లు వార్తలు వస్తున్నాయి. బ్యాంకులు రుణాలు ఇవ్వడం తగ్గించివేశాయి. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకం ఒకేసారి కాకుండా వాయిదాలలో మాఫీ చేయడం వలన రైతులు బ్యాంకులకు బాకీపడి ఉండడంతో తిరిగి కొత్త అప్పు ఇవ్వడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 7 సంవత్సరాలు గడిచినా, రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులుండగా 43 లక్షల మందికే బ్యాంకులు రుణాలిచ్చాయి. 17 లక్షల మంది ఇంత వరకు బ్యాంకు గడప తొక్కలేదు. కొత్తవారికి అప్పులివ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. ఇచ్చిన అప్పలకు కూడా స్కేలాఫ్‌్‌ ఫైనాన్స్‌ అమలు జరగలేదు. ప్రైవేట్‌ అప్పులు తెచ్చుకొని అధిక వడ్డీలు చెల్లిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధరల నిర్ణయాక సంఘాలను వేసి ఉత్పత్తి శాస్త్రీయంగా లెక్క వేసి దానికి 50 శాతం కలిపి మద్దతు ధరలు నిర్ణయించాలి. కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు పంటలకేకాక కూరగాయలకు మద్దతు ధరలు నిర్ణయించాయి. కౌలు రైతులకు రాష్ట్రంలో గుర్తింపులేదు. ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కౌలు రైతులకు కార్డులు ఇవ్వాలని, 2011 చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అన్ని మండల కేంద్రాలలో అవసరమైన, నాణ్యమైన విత్తనాలను మార్కెట్‌ కమిటీల ద్వారా, ప్రభుత్వ సంస్థల ద్వారా అందించాలి. 5 ఎకరాల లోపు రైతులకు విత్తనాలు పూర్తి సబ్సిడీపై ఇవ్వాలి. రుణ మాఫీ పథకాన్ని ఒకే మొత్తంలో ప్రభుత్వం చెల్లించడంకాని, తన ఖాతాలో వేసుకొని రైతులను రుణవిముక్తులను చేయాలి. రైతులందరికి కొత్త అప్పులు జూన్‌ 15లోపు ఇవ్వాలి. తగినన్ని ఎరువులు మండల కేంద్రాలలో నిల్వ పెట్టాలి. నకిలి ఎరువులు, పురుగు మందులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. 5 ఎకరాలలోపు రైతులకు ఎరువుల సబ్సిడీ ఇవ్వాలి. చిన్న వ్యవసాయ యంత్రాలు కొనుగోలు చేయడానికి సన్న, చిన్న కారు రైతులకు 60 శాతం సబ్సిడీపై ఇవ్వాలి. ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం సబ్సిడీపై ఇవ్వాలి. రైతు బీమా పథకాన్ని 18-75 సంవత్సరాల వరకు పెంచి ఈ ఆగష్టు నుండి ప్రభుత్వం ప్రీమియం చెల్లించాలి.

కేంద్రం ప్రకటించిన వ్యవసాయ మద్దతు ధరలు అశాస్త్రీయం

  • తెలంగాణ రైతు సంఘం
    2021-22 సంవత్సరానికి వ్యవసాయ పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటించింది. గత సంవత్సరం మద్దతు ధరలపై 10-15 శాతం పెంచి మాత్రమే ప్రకటించారు. ఆదే సందర్భంలో వ్యవసాయ ఉపకరణాల ధరలు 50శాతం పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం ఎరువుల సబ్సిడీలను తగ్గించింది. పెట్రోల్‌, డీజిల్‌, ఇనుము, సిమెంట్‌, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు ధరలు, వ్యవసాయానికి వినియోగించే యంత్రాల ధరలు-అద్దెలు విపరీతంగా పెరిగాయి. ఉపకరణాల ధరలను గమనంలోకి తీసుకోకుండా నామమాత్రంగా మద్దతు ధరలు పెంచడం జరిగింది. రైతుల దగ్గర కొనుగోలు చేసి ప్రాసెస్‌ చేసి మధ్య దళారీలు ఉప ఉత్పత్తుల అమ్మకం ద్వారా 100-150 శాతం లాభాలు సంపాదిస్తున్నారు. చివరకు ఎంఎస్‌పి ధరను అమలు చేయకుండా తక్కువ ధరకు కొనడం ద్వారా మరిన్ని లాభాలు సంపాదిస్తున్నారు.
    సిఏసిపి సూచించిన క్వింటాలు పెట్టుబడిపై 50శాతం కలిపి మద్దతు ధరలు నిర్ణయించాలి. కానీ ధరల నిర్ణయాక సంఘం సూచించిన పెట్టుబడిని కేంద్రం గమనంలోకి తీసుకోలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచించిన క్వింటాలు పెట్టుబడి వ్యయంపై 50శాతం కలిపి మద్దతు ధరలు నిర్ణయించాలి. దానిని గుర్తించలేదు. చివరికి రాష్ట్ర ప్రభుత్వం వరికి క్వింటాలు ధర రూ.4,137, సాధరణ గ్రెడ్‌కు రూ.4,005, మక్కజొన్నలకు రూ.3,444, సోయా రూ.7,362, పత్తి లాంగ్‌ స్టేపుల్‌కు రూ.14,931 ధర నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వనికి రెేకమండేషన్‌ చేసింది. దీనిని కేంద్రం గుర్తించలేదు. దేశంలో 20 లక్షల కోట్ల వ్యవసాయ మార్కెట్‌లలో ఈ ధరల వలన సంవత్సరానికి కార్పొరేట్‌లకు రూ.6 లక్షల కోట్ల లాభాలు వస్తున్నాయి. కనీస మద్దతు ధరలు అమలు జరపకపోవడం వలనే కొనుగోలు సంస్థలు ఏటా 2.5 లక్షల కోట్లు లాభాలు ఆర్జిస్తున్నారు. పెట్టిన పెట్టుబడి రాక అప్పుల పాలై రైతులు ఏటా 12,650 మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయినా కేంద్రం ఏ శాస్త్రీయ విధానాన్ని అనుసరించకుండా పంటల ధరలను నిర్ణయించి రైతులకు నష్టం కలిగిస్తున్నది. కేంద్రం 23 పంటలకే మద్దతు ధరలను నిర్ణయిస్తుంది. మనం పండిస్తున్న 100 పంటలకు మద్దతు ధరలు నిర్ణయించాలి. (అమెరికాలాగా). కేరళ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలు ధరల నిర్ణయాక కమిషన్లు వేసి కూరగాయలు, పండ్లతో సహా మద్దతు ధరలు నిర్ణయించి అమలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరల నిర్ణాయక కమిషన్‌ వేసి రైతులు పండించే అన్ని పంటలకు మద్దతు ధరలు నిర్ణయించాలి. వాస్తవానికి రాజ్యాంగంరీత్యా ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. తెలంగాణ ప్రభుత్వం కమిషన్‌ వేసి అన్ని పంటలకు మద్దతు ధరలు నిర్ణయించాలి.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.