ధాన్యం కొనుగోళ్లలోనూ తెలంగాణ దేశానికే ఆదర్శం

0
TMedia (Telugu News) :

ధాన్యం కొనుగోళ్లలోనూ తెలంగాణ దేశానికే ఆదర్శం

కేసీఆర్ నిర్దేశకత్వంలో భారీ ఎత్తున ధాన్యం సేకరణ

కోవిడ్ విపత్కర తరుణంలో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

అన్ లోడింగ్ , ఇతర సమస్యల పరిష్కారానికి టాస్క్ ఫోర్స్ కమిటీ

s s consultancy

ప్రభుత్వం చర్యల ఫలితంగా కోవిడ్ తగ్గుముఖం

ధాన్యం కొనుగోళ్లు, కోవిడ్ పై సమీక్షా సమావేశంలో ఎంపీ నామ నాగేశ్వరరావు

ఖమ్మం, మే 25 : ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నిర్దేశకత్వంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా
తెలంగాణలో ఆదర్శవంతంగా భారీ ఎత్తున ధాన్యం సేకరణ జరుగుతుందని టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత,ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక టీటీడీసీ సమావేశ మందిరంలో ధాన్యం
కొనుగోళ్లు, కోవిడ్ పై జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులతో మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో
ఎంపీ నామ మాట్లాడారు. కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటి వరకు 60 లక్షల మెట్రిక్
టన్నుల ధాన్యాన్ని సేకరించడం మామూలు విషయం కాదని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో పంజాబ్ తర్వాత తెలంగాణానే ముందంజలో ఉందన్నారు. ఎంత ఇబ్బంది ఉన్నా కూడా మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసి, అన్నదాతలకు అండగా నిలవాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకుపోతున్నారని అన్నారు. అయితే ఇతర
జిల్లాల్లో రైస్ మిల్లులు వద్ద అన్ లోడింగ్ సమస్యతో పాటు హమాలీల సమస్య వల్ల కొంత ఇబ్బంది ఉన్నా జిల్లాలో దాదాపు 2.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే సేకరించడం అభినందనీయమన్నారు. అయితే ధాన్యం అన్ లోడింగ్
వేగంగా జరిగేందుకు ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తే ఈ సమస్యను అధిగమించవచ్చని ఎంపీ నామ అధికార యంత్రాంగానికి సూచించారు. ఈసారి జిల్లాలో దిగుబడి ఎక్కువుగా ఉందన్నారు. రానున్న రోజుల్లో మిగిలిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైతులను ఆదుకోవడం
జరుగుతుందన్నారు. రోజుకు 15వేలు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని, అధికారులు,
ప్రజాప్రతినిధుల సమన్వయంతో పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరుగుతున్నాయని అన్నారు.

ప్రజల ప్రాణాలు కాపాడడమే మా లక్ష్యం: ఎంపీ నామ

కోవిడ్ భారి నుంచి ప్రజల ప్రాణాలు రక్షించేందుకు అవసరమైన అన్ని రకాలైన చర్యలను సీఎం కేసీఆర్,
మంత్రి కేటీఆర్ నిర్దేశకత్వంలో యుద్ధప్రాతిపదికన తీసుకోవడం జరిగిందన్నారు. కోవిడ్ పై జరిగిన సమీక్షలో ఎంపీ నామ మాట్లాడారు. ప్రజల ప్రాణాలు నిలబెట్టేందుకు
అవసరమైన ఆక్సిజన్,బెడ్లు, మందులు, ఇతర అన్ని సౌకర్యాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఫలితంగా
ఇటీవల కొద్ది రోజులుగా కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టిందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల
ఇంజక్షన్లు, మందులు, ఆక్సిజన్, బెడ్లు అందుబాటులో ఉన్నాయని, ఎటువంటి కొరత లేదన్నారు. జిల్లాలో
చిన్న చిన్న ఘటనలు మినహా మొత్తం మీద డాక్టర్లు, సిబ్బంది మంచిగా సేవలు అందిస్తున్నారని అన్నారు.
అంతా సమన్వయంతో కలిసి, ప్రజల ప్రాణాలు కాపాడాలనే లక్ష్యంతోనే ముందుకు పోవాలన్నారు. టెస్టులు
సంఖ్యను పెంచి, కొత్త కేసులు లేకుండా చూడాలన్నారు. బయట ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రోగులు
వస్తున్నారని, దాని వల్ల కొంత సమస్య ఏర్పడుతుందన్నారు. నామ ముత్తయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లాలోని
ఖమ్మం, మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, పాల్వంచకు అంబులెన్స్ లను అందజేయడం జరిగిందని, వాటి నిర్వహణకు డబుల్ డ్రైవర్లను నియమించి, ప్రజల ఇబ్బందులను తొలగించాలని ఎంపీ నామ అధికారులను
కోరారు. మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టడడం ద్వారా కోవిడ్ ఉధృతిని మరింతగా నిర్మూలించవచ్చని అన్నారు.
పార్టీ నేత బేగ్ బెంగుళూరులో చనిపోతే తాను విమానం ద్వారా కావాల్సిన ఇంజక్షన్లు పంపించి, ఆయన
ప్రాణాలు కాపాడేందుకు శతవిధాలా శ్రమించానని గుర్తు చేశారు. ఇలా ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా తాను
ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, వారిని కాపాడుతున్నానని అన్నారు.
కోవిడ్ నియంత్రణలో తీసుకున్న చర్యల
ఫలితంగా కేసులు తగ్గుముఖం పట్టాయని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. సమీక్షా సమావేశంలో
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్
రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్
లింగాల కమలరాజు, డీసీసీబీ చైర్మన్ కూరకుల నాగభూషణం ,రాయల శేషగిరిరావు, రైతుబంధు జిల్లా
కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు,
జిల్లా కలెక్టర్ కర్ణన్, ఎస్పీ విష్ణు ఎస్. వారియర్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ
తదితరులతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.