ప్రేమ వివాహం ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి

0
TMedia (Telugu News) :

ప్రేమ వివాహం ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి

s s consultancy

టి-మీడియా (మే25) కర్నూలు జిల్లా తుగ్గలి

తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామానికి చెందిన ఓ యువతి , యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో ఇంట్లో నుంచి పారిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు .
దీంతో కోపోద్రిక్తులైన యువతి తల్లిదండ్రులు బంధువులు యువకుడి కుటుంబంపై దాడికి పాల్పడ్డారు.
అతడి సామాజిక వర్గానికి చెందిన మరో ఆరు ఇళ్లపై దాడి చేశారు . ఇంట్లోని సామాగ్రినంతా బూడిద చేసి , నాలుగు ఆటోలకు కూడా నిప్పు పెట్టారు . దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని అమ్మాయి తరపు బంధువులను నిలువరించే ప్రయత్నం చేశారు.
దీంతో మరింత రెచ్చిపోయిన వారు పోలీసులపైనే దాడికి యత్నించి కళ్లల్లో కారం చల్లారు . దీంతో పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా బలగాలను అక్కడికి పంపించారు.
కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న బలగాలు విధ్వంసకారులను నిలువరించడంతో పరిస్థితి సద్దుమణిగింది.
మరోవైపు ఈ ఘటనతో భయాందోళనకు గురైన యువకుడి కుటుంబసభ్యులు గ్రామం విడిచి వెళ్లిపోయారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.