రోడ్లవెంబడి మొక్కలు మంచిగా నాటారు;కలెక్టర్ ప్రశంస

0
TMedia (Telugu News) :

టీమీడియా సుజాతనగర్;

దేవిపల్లి మండలం ఇల్లందు క్రాస్ రోడ్ నుండి ఇల్లందు వరకు, జూలూరుపాడు నుండి కొత్తగూడెం వరకుఅవెన్యూ ప్లాంటేషన్ లో మొక్కలు మంచిగా నాటారని జిల్లా కలెక్టర్ అనుదీప్ రోడ్ స్ట్రెచ్ అధికారులను, ఎంపిడిఓ, ఎంపీవోలను,సర్పంచులను, పంచాయతీ కారదర్శులను జిల్లా కలెక్టర్ అనుదీప్ అభినందించారు. శనివారం లక్ష్మీ దేవిపల్లి మండలం ఇల్లందు క్రాస్ రోడ్నుండిఇల్లందు వరకు మరియు జూలూరుపాడు నుండి కొత్తగూడెం వరకు ప్రధాన రోడ్ల వెంబడి అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలను ఆయన ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన రహదారులతో పాటు గ్రామాలు, మున్సిపాలిటీలలోని అంతర్గత రహదారుల్లో మొక్కలు నాటాలని ఇంచు ఖాళీ స్థలం కూడా మొక్కలు లేకుండా ఖాళీగా ఉండొద్దని చెప్పారు.

s s consultancy

ఇల్లందు క్రాస్ రోడ్ నుండి ఇల్లందు వరకు అవెన్యూ ప్లాంటేషన్ లో గతంలో కంటే గణనీయమైన మెరుగుదల కనిపించినట్లు చెప్పారు. అంతరాలను అధిగమించడానికి బహుళ లేయర్ ప్లాంటేషన్ తో పాటు మొక్కల సంరక్షణను ఇంకా కృషి చేయాల్సిన అవసరం వుందని ఆయన చెప్పారు. జూలూరుపాడు నుండి కొత్తగూడెం అవెన్యూ ప్లాంటేషన్ చాలా అద్భుతంగా ఉందని, మంచి మంచి మొక్కలు నాటారని, డివైడర్లలో చేపట్టిన మధ్యస్థ ప్లాంటేషన్‌తో పాటు రంగు రంగుల ట్రీ గార్డ్‌లతో పొడవైన మొక్కలు నాటారని, మొక్కలు చూసి చాలా సంతోషించానని ఆయన చెప్పారు. నేను గతంలో చూసినప్పటి నుండి ఇప్పటి వరకు మొక్కలు నాటడంలో తీవ్రమైన పురోగతి ఉందని చెప్పారు. జూలూరుపాడు, సుజాతనగర్, చుంచుపల్లి మండల ప్రత్యేక అధికారులు ర.భ. ఈ ఈ భీంలా, పౌర సరఫరాల సంస్థ డీఎం ప్రసాద్ ను, జడ్పి సీఈఓ విద్యాలతను, రోడ్ స్ట్రెచ్ స్పెషల్ ఆఫీసర్ డిఆర్డీఓ మధుసూదన్ రాజును, జెడ్పి సీఈవో విద్యాలతతో పాటు సంబంధిత మండలాల ఎంపిడిఓ, ఎంపిఓలను, సర్పంచ్‌ లను, పంచాయితీ కార్యదర్శులను కలెక్టర్ అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని మన జిల్లాను హరిత జిల్లాగా తయారు చేయాలని ఆయన పేర్కొన్నారు.

District Mandal from Illandu cross Road to Illandu, from Zulurpadu to Kottagudem district collector Anudeep told road stretch officials, MDPOs and MPVs that the plants should be planted well in Avenue Plantation.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.