మానవీయ పరిష్కారం

20 ఏళ్ల క్రితం విడిపోయిన దంపతులను కలిపిన జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఇద్దరితో తెలుగులో మాట్లాడి నచ్చజెప్పి ఒప్పించిన సీజేఐ

0
TMedia (Telugu News) :

దిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ మానవీయ సంప్రదాయానికి తెరతీశారు. రెండు దశాబ్దాల క్రితం విడిపోయి, సుప్రీంకోర్టు వరకు వెళ్లిన దంపతులను తానే చొరవ తీసుకుని కలిపారు. విభేదాలు మరిచిపోయి భావిజీవితం గడిపేలా ఓ కుటుంబపెద్దలా వారికి సర్దిచెప్పారు. బుధవారం సుప్రీంకోర్టులో చోటుచేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా న్యాయవర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇటీవల కాలంలో న్యాయప్రక్రియలో మధ్యవర్తిత్వం ప్రాధాన్యాన్ని నొక్కిచెబుతున్న సీజేఐ.. తన నేతృత్వంలోని ధర్మాసనమే వేదికగా ఈ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. పెళ్లయి, బిడ్డ పుట్టిన ఏడాదికే విడిపోయి సుప్రీంకోర్టును ఆశ్రయించిన కళ్లెం శ్రీనివాసశర్మ, శాంతి దంపతులను ఒక్కటి చేశారు. సాధారణంగా సుప్రీంకోర్టులో న్యాయవాదులే తప్ప కక్షిదారులను విచారించే పద్ధతి లేకపోయినా ప్రధాన న్యాయమూర్తి వ్యక్తిగత చొరవ తీసుకొని భార్యాభర్తలిద్దర్నీ కోర్టు ముందుకు రమ్మని వారి మనోగతాలను తెలుసుకున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.