జర్నలిస్ట్‌, నిర్మాత బి.ఎ.రాజు ఇకలేరు.

0
TMedia (Telugu News) :

హైదరాబాద్ :

సీనియర్‌ జర్నలిస్ట్‌, నిర్మాత బి.ఎ.రాజు ఇకలేరు. డయాబెటిస్‌ హెచ్చుతగ్గులతో శుక్రవారం రాత్రి హైదరబాద్‌లోని కేర్‌ ఆసుపత్రిలో చేరిన ఆయన చిక్సిత పొందుతూ గుండెపోటుతో మరణించారు.

ఈ విషయాన్ని ఆయన తనయుడు శివ తెలిపారు.

నాలుగున్నర దశాబ్దాలుగా జర్నలిస్ట్‌గా పనిచేస్తూ సూపర్‌హిట్‌ వారపత్రికను నడుపుతున్నారు.

s s consultancy

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్‌ హీరోలు నుంచి యువ హీరోల వరకూ, దాదాపు 600లకు పైగా చిత్రాలకు ఆయన పీఆర్వోగా వ్యవహరించారు.

2003లో ఆయన నిర్మాతగా మారి ఆయన భార్య బి.జయ దర్శకత్వంలో ‘చంటిగాడు’ చిత్రం తీశారు.

ఆ తర్వాత గుండమ్మగారి మనవడు, లవ్‌లీ,  వైశాఖం చిత్రాలను నిర్మించారు.

2018లో ఆయన భార్య, దర్శకురాలు జయ మరణించారు.

ఆయన నిర్మించిన చివరి చిత్రం ‘వైశాఖం’. సూపర్‌స్టార్‌ కృష్ణకు బి.ఏ.రాజు వీరాభిమాని. ఆయన ప్రోద్బలంతోనే రాజు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు.

బి.ఎ.రాజు మరణం పట్ల సినీ ప్రముఖులు, సినీ జర్నలిస్ట్‌లు తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యారు. 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.