కనికరం రాజన్న కరోనా తో కన్ను మూత.

0
TMedia (Telugu News) :

కామ్రేడ్ కనికరం రాజన్న
కరోనా తో కన్ను మూత.

టీ మీడియా ప్రతినిధి మంచిర్యాల జిల్లా.

s s consultancy

జన్నారం మండలానికి చెందిన కనికరం రాజన్న ఆయన మృతి పట్ల ప్రజలు తీవ్ర సంతాపం వ్యక్తం చేసారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.ఈ సందర్భంగా రాజన్న గురించి చెప్పగా యెంత గొప్ప ప్రజా నాయకుడు అనే విషయం నేటి నవతరానికి తెలియడం కోసం కొన్ని
ముఖ్యమైన విషయాలు మీ ముందు ఉంచుతున్నాము అన్నారు.
నిరుపేద మేదరి కులం లో నేటి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మొర్రి గూడెం గ్రామం లో జన్మించారు. కనికరం రాజన్న.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్న పీపుల్స్ వార్ పార్టీ కి ఆకర్షితుడై 1974 లోపార్టి లో చేరారు .ఆ తరువాత1977 నుండి 1995 వరకు సి పి ఐ ఏం ఎల్ ప్రజా పంధా లో . పని చేశారు క్రమంగా దళం లో చేరి కనికరం రాజన్న (కే.ఆర్) అలియాస్ బాబాన్న గా పేరు మార్చుకున్నాడు.
సుమారు 8 సంవత్సరాలు దళం లో పని చేసిన తరువాత 1982 లో దళ కమాండర్ గా భాద్యతలు నిర్వహించారు
ఆ సమయంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా
వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారం
ఎన్నో సాయుధ పోరాటాలు చేశారు.3 సార్లు త్రుటి లో ఎన్కౌంటర్ లో తప్పించుకున్నారు.
సుమారుగా ఏడు సంవత్సరాల ఆరు నెలలు వరంగల్ జైలు లో ప్రజల కోసం జైలు జీవితం అనుభవించారు..
186 పోలీస్ కేసులు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్న సందర్భంగా రాజన్న మీద మోప బడ్డాయి.

ఆయన నాయకత్వం లో సాగించిన ప్రజా పోరాటాలు సాధించిన విజయాలు.

ఖానా పుర్ మండలం లో ఇటికాల.పెంబి గ్రామం లో 97 ఏకరాల పట్టా భూమి నీ రసుల్ల పట్వారీ నుండి తీసుకొని
150 మంది నిరుపేదలకు పంచారు.జైనుర్ మండలం చింత కర్ర గ్రామం లో జాదవ్ కిషన్ నాయక్ అనే భూస్వామి నుండి 150 ఏకరాలు భూమి నీస్వాధీనం చేసుకొని
75 మంది పేదలకు పంచారు.కడెం నారాయణరెడ్డి మాజీ ఏం.పి రాజ్య సభ సభ్యుడు కి చెందిన 8000 ఏకారాల భూమిని అంబారుపేట దేవుని గూడ గ్రామం లో 5000 మంది పేదలకు పంచారు.నెన్నెల మండల కేంద్రం లో మందమర్రి మాధవరావు భూమిని నిరుపేదలు సాగు చేసుకొని జివిస్తుండగా అట్టి పంటను మాధవరావు తీసుకు వెళ్ళే వాడు.అతని 300 యేకరాల భూమి 300 పేదలకు పంచాడు.జన్నారం మండలం కవ్వాల్…మురి మడుగు….కొత్తపేట ..ఈ 3 గ్రామాలలో 2100
ఏకరాలా ఫారెస్ట్ బంజరు భూమిని చెట్లు తీసివేసి 1500 మంది ప్రజలకు పంచి ప్రభుత్వం తో పట్టాలు కూడా ఇప్పించారు.పోలీస్ నిర్భందాల మద్యన కేసులు పెడుతూ అవకాశం దొరికితే కాల్చివేసెందుకు పోలీసులు వెంట పడుతున్న సమయం లో.. ప్రాణాల కు తెగించిఎంతో దైర్యంగా
పోరాడిన వీరుడు …మన కామ్రేడ్ రాజన్న.అదిలాబాద్ జిల్లాలో బీడీ ఆకుల పోరాటం జరిపి20 మండలాల లో సమ్మె చేసి కులిరెట్లు పెంచారు.ఆ సందర్భంగా పోలీసుల చేతిలో చిత్ర హింసలకు గురి అయ్యారు రాజన్న.
ఇలా ఇలా ఎన్నో ప్రజా పోరాటాలు నిర్వహించి..ఆ పోరాటాల సందర్భంగా
ఎలాంటి కేసులు అయినా.జైలు కు వెళ్లాల్సి వచ్చిన భయపడకుండా …తన జీవితాన్ని
ప్రజల కోసం అంకితం చేసిన గొప్ప వీరుడు
మన కామ్రేడ్ కనికరం రాజన్న.
ఆయన శ్రీమతి పేరు లింగవ్వ.
ఇద్దరు కుమారులు..ఇద్దరు కుమార్తెలు.ఇన్ని పోరాటాలు చేసిన రాజన్న చివరి నిమిషం వరకు కూడా సాధారణ జీవితం
కొనసాగించాడు ..సి పి ఐ ఏం పార్టీలో చేరి..పూర్తి కాలం కార్యకర్త గా పని చేస్తూ..వ్యవసాయ కార్మిక సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా భాద్యతలు నిర్వహిస్తున్నారు.వేల ఏకరాలు పేదలకు పంచి పెట్టిన తను మాత్రం తీసుకోలేదు.
కనికరం రాజన్న మంచి గాయకుడు.ప్రజలను కదిలించే గొప్ప పాటలు బాగా పాడే. వారు.వీరు తెలంగాణ రాష్ట్ర మేదరి సంఘం కు అనుబంధంగా ఉన్న సాంస్కృతిక విభాగంనకు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గా ఉన్నారు.ఏది ఏమైనా తను నమ్మిన సిద్ధాంతం కొసం ప్రజల కొరకు జీవితాంతం పోరాడిన గొప్ప పోరాట యోధుడు
కనికరం రాజన్నకు… ప్రజలు
వారికి మరొక్క సారి జోహార్లు అర్పించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.