ఘంటసాల కుమారుడు కన్నుమూత

0
TMedia (Telugu News) :
s s consultancy

ఘంటసాల కుమారుడు కన్నుమూత

చెన్నై: సుప్రసిద్ధ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు రెండో కుమారుడు రత్నకుమార్‌ కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయనకు రెండు రోజుల క్రితమే నెగటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధింత సమస్యలతో ఇబ్బందిపడుతున్నారని.. డయాలసిస్‌ చికిత్స తీసుకుంటున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. రత్నకుమార్‌ ఆకస్మిక మరణంతో ఘంటసాల కుటుంబంలో విషాదం నెలకొంది. మరోవైపు, ఆయన మరణవార్తతో చిత్రపరిశ్రమలోనూ విషాదచాయలు అలముకున్నాయి.
ఘంటసాల కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రత్నకుమార్‌.. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా దక్షిణాది భాషల్లోనే కాకుండా హిందీలోనూ తెరకెక్కిన ఎన్నో చిత్రాలకు తన వాయిస్‌ అందించారు. ఎనిమిది గంటలపాటు ఏకధాటిగా డబ్బింగ్‌ చెప్పి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ ఆయన స్థానం సంపాదించుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఇప్పటివరకూ ఆయన వెయ్యికి పైగా సినిమాలకు డబ్బింగ్‌ చెప్పారు. ‘వీరుడొక్కడే’, ‘ఆట ఆరంభం’, ‘అంబేడ్కర్‌’ చిత్రాలతో పాటు దాదాపు 30 సినిమాలకు ఆయన మాటలు కూడా అందించారు. 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.