ధైర్యసాహసాలకు మరో పేరు… ఏఎస్ఐ బైరిశెట్టి మల్లేశ్వర్

0
TMedia (Telugu News) :

ధైర్యసాహసాలకు మరో పేరు… ఏఎస్ఐ బైరిశెట్టి మల్లేశ్వర్

●దేశ, రాష్ట్ర శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఎల్లవేళల నవంతు కృషి చేస్తాను.
●యువతను సన్మార్గంలో నడిపించడానికి తన వంతు కృషి చేస్తాను.
●కుటుంబ ప్రోత్సాహంతోనే... ఉద్యోగం.

అతనో మట్టిలో మాణిక్యం…తాను అనుకున్న లక్ష్య సాధనతో ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించి ప్రజలకు సేవ చేస్తూ……సమాజంలో మంచి గుర్తింపు తీసుకురావాలని… మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన అపజయాలను సైతం లెక్క చేయకుండ..తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ…తమ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో….కష్టపడి ఉద్యోగం సాధించి పేరు ప్రఖ్యాతలు తీసుకురావడమే లక్ష్యంతో వారిలో మనోధైర్యాన్ని నింపుకుని పట్టుదలతో ఉద్యోగం సాధించి ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తూ శాంతి పరిరక్షణ రంగంలో తనదైన శైలిలో ముందుకు సాగుతూ ధైర్యసాహసాలకు మారుపేరుగా నిలుస్తున్న ఏఎస్ఐ బైరిశెట్టి మల్లేశ్వర్.

ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని పట్టుదలతో  తనలో ఆత్మస్థైర్యాన్ని నింపుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ తమ కుటుంబంలోని ఆర్థిక పరిస్థితులు లెక్కచేయకుండా తన ఆలోచనతో మొదలు పెట్టి తనలో మనోధైర్యం నింపుకొని ఉద్యోగం సాధించి మట్టిలో మాణిక్యంగా పేరు పొందుతున్న ఏఎస్ఐ బైరిశెట్టి మల్లేశ్వర్

●కుటుంబ ప్రస్తావన.

కరీంనగర్ జిల్లా మానకొండూరు గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన బైరిశెట్టి మల్లేశ్వర్ తమ తల్లిదండ్రులైన బైరిశెట్టి నారాయణ, లక్ష్మిలకు జన్మించిన రెండవ సంతానం. అతనికి ఒక అన్నయ్య వెంకట రమణ కూడా ఉన్నారు. వృత్తిరీత్యా వ్యవసాయ కుటుంబమైన పేదరికాన్ని సైతం లెక్కచేయకుండా బైరిశెట్టి మల్లేశ్వర్ వారి తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే కష్టపడి ఉద్యోగం సాధించాడు. అనంతరం 1993 సంవత్సరంలో స్వరూప రాణిని వివాహమాడారు. వీరికి ఇద్దరు కుమారులు ఒకరు సాయి యశ్వంత్ పటేల్, మరొకరు సాయి చాణక్య పటేల్. వారి కుటుంబంతో సంతోషంగా గడుపుతూ వారి
కుటుంబ ప్రోత్సాహంతోనే… ఉద్యోగం సాధించి ఉద్యోగంలో కూడా ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఉత్తమంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

●విద్యాభ్యాసం.

చిన్నప్పటి నుండి మానకొండూరు గ్రామంలో ప్రభుత్వ  పాఠశాల, కళాశాలలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు.

s s consultancy
●పోస్టింగ్ మరియు ప్రమోషన్లు.

మొదటి పోస్టింగ్ 1990 లో హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో  విధులు నిర్వహించారు. అలాగే పోత్కపెల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు. దాని తర్వాత కరింనగర్ రురల్ పోలీస్ స్టేషన్లో, తర్వాత అడవి ముత్తారం పోలీస్ స్టేషన్లో, దాని తర్వాత గంగాధర పోలీస్ స్టేషన్లో, తర్వాత హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో, దాని తర్వాత కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు. దాని తర్వాత హెడ్ కానిస్టేబుల్ గ ప్రమోషన్ పై బెజ్జంకి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు. తర్వాత కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు. దాని తర్వాత ఏఎస్ఐ గ ప్రమోషన్ పై ప్రస్తుతం ఈల్లందకుంట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా టి మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ రక్షణ రంగంలో ప్రజా సేవకై నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఎల్లవేళల కృషి చేస్తానని తెలిపారు. యువతను సన్మార్గంలో నడిపించడాని కి తన వంతు కృషి చేస్తానని, యువత చెడు మార్గంలో ప్రయాణించకుండా మంచి మార్గంలో నడిపించే విధంగా అన్ని విషయాలు నేరుగా వారితో కలసి యువతను ఉద్యోగ రంగంలో రాణించే విధంగా తోడ్పడతానని తెలిపారు. సమాజంలో గౌరవం అభిమానం ఉన్న మమకారంతో ఫ్రెండ్లీ పోలీస్ గా మెలుగుతూ…. నా మీద ఉన్న నమ్మకాన్ని విశ్వాసాన్ని పోలీసు రక్షణ రంగంలో తనదైన శైలిలో ముందుకు తీసుకు వెళ్తానని తెలిపారు.

( వినయ్, రామగుండం, పెద్దపెల్లి జిల్లా, సెల్ నెంబర్ : 8790330963 )

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.