తిరుమలలో దందారాయుళ్లు

అక్రమార్జన ఏడాదికి 40 కోట్లు

0
TMedia (Telugu News) :

 

-కేశఖండనం “టు” క్యాంటీన్ వరకువారే

-వీఐపీ దర్శనమంటూవసూళ్ళు

-క్లాక్ రూముఫీజుల్లో గోల్ మాల్

టీమీడియా ఆధ్యాత్మికం

కులం,మతం ప్రాంతీయం భేదం లేకుండా తాను స్వయంగా తిరుపతి తిరుమల కు వెళ్లి అభివృద్ధి పై దృష్టి పెట్టి సీఎం జగన్ మోహన్ రెడ్డి పనిచేస్తున్నారు.

చిన్నతిరుపతి,చిన్నతిరుమల గా పెరుగాంచి రోజుకు 25 వెల మంది వరకు భక్తులు దర్శించుకొనే ఆంద్రప్రదేశ్ లోని పచ్ఛిమ గోదావరి జిల్లా లో ఉన్న ద్వారక తిరుమల దేవస్థానం లో అక్రమార్కులు తిష్ఠ వేశారు.భక్తులు నుండి వచ్చిన సందేశం తో అఖిలభారత బ్రాహ్మణ(సర్వీస్)నెట్వర్క్ క్షేత్ర స్థాయి సందర్శన చేసింది.ఒక నివేదిక తయారు చేశామని సీఎం జగన్ దృష్టికి తీసుకు వెళ్తామని నెట్వర్క్ నేతలు టీమీడియా కి తెలిపారు.
. *ఏ ఐ బి ఎన్ ఎస్ అధ్యక్షులు ఎస్ ఎమ్. కృష్ణ తెలిపిన వివారాలు ప్రకారం ..దేవస్థానం లో తిష్ఠ వేసిన ఆక్రయార్కుల ఆదాయం ఏడాదికి 40 కోట్లు ఉంటుంది. దేశం లోని అతి పెద్ద ఆధ్యాత్మిక కుంభకోణం అని అన్నారు. రెండు తేలుగు రాష్ట్రల లోని ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఈ తరహా అక్రమాలు. ఉన్నాయి.అన్నారు.

 

వివారాలు పరిశీలిస్తే..
దేశీయంగా పేరుగాంచిన ద్వారాక తిరుమల రెండు తెలుగు రాష్ట్రాల భక్తులు ఎక్కువ గా ఉంటారు.వారిలో విశ్వాసం ఎక్కువ.చిన్న శుభాకార్యాలయాలు,పెళ్లిళ్ళు లాంటి వి కూడా అక్కడ చేసుకొంటరు..అక్కడ దైవ దర్శనం కి ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనము(100రూపాయలు),అతి శీఘ్రదర్శనం (200లు) కల్పించారు.ఇది కాక అన్నింటి లాగా వీఐపీ దర్శనం తూర్పు ద్వారం ద్వారా నుండి ఉంటుంది.ఈ వీఐపి కూడా ఉచితం.ఎటువంటి ఆంక్షలు ఉండవు.ఈ వీఐపి దర్శనం అక్రమార్కులు కు పెద్ద ఆదాయ వనరు గా మారింది..దీనితో పాటు ఆధ్యాత్మిక కేంద్రాల లోకి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకు పోవడం నిషేధం.సెల్ ఫోన్ లు లాంటివి..నిత్య జీవితం లో సెల్ ఒకటి అయిన నేపథ్యం లో దర్శనం పోయి వచ్చే వరకు దాచుకోవడానికి క్లాక్ రూమ్ ఏర్పాటు చేశారు ఇది ఒక అక్రమ వనరు ఆదాయము గా మార్చారు.దర్శనానికి వచ్చే వారు లో 90 శాతం మంది కేశ ఖండనం(తల వెంట్రుకలు)ఇస్తారు.ఇందుకు కేవలం 25 రూపాయి లు టికెట్ ఇది ఒక అక్రమ వనరు,దేవస్థానం ఉచిత భోజనం సౌకర్యము కల్పించింది.కేవలం అల్పాహారంకు మాత్రమే క్యాంటీన్ ఉంది.అది అక్రమార్కులు కు వరం. ఇలా కొబ్బరి కాయలు ,పూజ సామగ్రి విక్రయాలు,పార్కింగ్ ఇలా ప్రతి దానిలో ముఖ్యంగా భక్తులు ఇతర ప్రాంతాల నుండి కొండ పైకి వచ్చి వెళ్లే రవాణా లోను బారి అవినీతి ఉంది.ఈ మొత్తం వ్యవాహారం లు వెనుక బడా రాజకీయ వేత్తలు,ప్రముఖులు గా చలామణి అవుతున్న వారు ఉన్నారు అనేది నెట్వర్కు సభ్యులు అభిప్రాయం గా ఉంది.

Also Read:ప్రారంభానికి సిద్ధమవుతున్న

పాఠశాలలు

 

no warer taps
no warer taps
s s consultancy
వీఐపీ ముసుగులో..
ఆలయం తూర్పు ద్వారం నుండి వీఐపీ లకు ప్రవేశం ఉంది.పెద్దగా వీఐపీలు తాకిడి ఉండదు.అయిన ఒక్క వ్యక్తికి వెయ్యి రూపాయలు చెల్లిస్తే 5 నిమిషాల్లో దర్శనం పూర్తి చేయిస్తా రు.ఇందుకు అడ్డాగా సామాన్లు బద్ర పరిచే గది ఉంది.అక్కడ ఉండే వ్యక్తి డబ్బులు తీసుకొని సెల్ ద్వారా ఆలయం లోపల ఉండే ఉద్యోగికి సెల్ సందేశం పంపిస్తారు.ఆయన వీఐపీ ద్వారం వద్దకు వచ్చి లోనకు తీసుకు వెళతారు ప్రతి రోజు సగటున 5వందలు మందిని అక్రమంగా లోనికి పంపడం ద్వారా 5లక్షలు రోజుకు,నెలకు 1.5 కోట్లు,ఏడాదికి 18 కోట్లు ఆక్రయార్కుల అర్జన గా ఉంది అన్నారు.ఈ విషయాలు సీసీ కెమెరాల లో నిక్షిప్తం అయింది అని కూడా వారు ఆరోపించారు.అతి శీఘ్ర దర్శనం 200ల టికెట్లు సింహ ద్వారం లో భక్తుడునుండి తీసుకోవాల్సిన వ్యక్తి కూడా విధుల్లో ఉండకుండా అక్రమ దర్శనం కలెక్షన్స్ చూస్తున్నారు అన్నారు.. నెట్వర్క్ టీము వద్ద కు 200 ల దర్శనం టికెట్ రావడం ను బట్టి ఆ టికెట్లు ను రిసైక్లింగ్ చేస్తున్నారు అని అనుమానం వ్యక్తం చేశారు.

కేశఖండనం మసీదు 3 లక్షలు

తల వెంట్రుకలు ఇవ్వడానికి అధికారిక ఫీజ్ 25 రూపాయలు.ఆకాయితము పట్టుకొని కేశఖండనం శాల కు వెళితే సిసి కెమెరాలు సాక్షిగా ఒక్కరి వద్ద 30 నుండి 50 రూపాయలువసూలు చేస్తున్నారు.రోజుకు ఇక్కడ అక్రమ కలెక్షన్ 3లక్షలు నెలకు 36 లక్షలు ఏడాది కి 4కోట్లు వరకు ఉంది. అక్కడి స్థానాలు గదులు నీటి ప్రవాహం తో నిండి ఉంటాయి. వాటిని ఎప్పటి కప్పుడు శుభ్రం చేయాల్సిన పారిశుధ్య కాంట్రాక్టు రు అసలు కనిపించరు.

Als0 Read:సంప్రదాయ భోజనంపై దుష్ప్రచారమా?

క్లాక్ రూములు

లగేజ్ తో పాటు,సెల్ ఫోన్ లు కోసం ప్రత్యేక కౌటర్లు ఉన్నాయి.ఇక్కడ అసలు రేట్లు బోర్డులు ఉండవు.సెల్ ఫోన్ ఉంచితే గంటకు 10 రూపాయలు అదనపు సమయం అయితే 15 నుండి 20 కూడా తీసుకొంటారు.సెల్ ఫోన్ సెంటర్ లో డిజిటెల్ పేమెంట్ కు అవకాశం లేదు.లగేజీ భద్రపర్చే ప్రాంతం లో ఫోన్ పే ఉంది.వీరు ఇచ్చే కూపన్లు కు .తీసుకొనే మొత్తలకు సమందం లేదు.ఇక్కడ ప్రతి రోజు లక్షల్లో అక్రమ కలెక్షన్స్ ఉన్నాయి.

క్యాంటీన్ లో .పదనిసలు

ఆధ్యాత్మిక కేంద్రం లో అల్పాహార కేంద్రం అనేది అత్యంత నిష్ఠ తో కూడుకొని ఉండాలి.ఇక్కడి క్యాంటెన్ లో సాంప్రదాయం లేదు.రేట్లు బోర్డు ఉండదు.. మంచి నీటి గ్లాసులు శుభ్రత లేదు.అక్కడి సిబ్బంది కి చేతికి తొడుగులు,మాస్క్ లు లాంటివి కనిపించవు.ప్రశ్నించిన వారితో గొడవకు దిగుతారు. దేవస్థానం లో ప్లాస్టిక్ నిషేదము ఉన్న ఇక్కడ ప్లాస్టిక్ గ్లాసులు వాడుతున్నారు అని తెలిపారు.

స్టాల్స్ లో ధరలు

ఒక కొబ్బరికాయ 50 రూపాయలు,బొమ్మలు ఇతర ఫోటోలు రేట్లు చెప్పాల్సి న పనిలేదు.కొబ్బరి చిప్పలు సేకరిస్తున్న వ్యక్తులు కాంట్రాక్టు లు పొందారా అది కూడా అక్రమా మా అన్న అనుమానాలు వ్యక్తం చేసారు.

సాంప్రదయ విరుద్ధం గా

ఆలయ సాంప్రదాయం ప్రకారం లోన సెల్ ఫోన్ లు నిషిద్ధం.ఆయిన కొంతమంది సిబ్బంది సెల్ ఫోన్ లు యధేచ్చగా వినియోగిస్తున్నారు.వీఐపీ మార్గం లో వచ్చే వారి వెంట ఉంటున్నాయి.విధుల్లో ఉన్న సిబ్బంది తెల్లటి పట్టు వస్త్రాలు మాత్రమే ధరించాలి.అందుకు విరుద్ధంగా వివిధ రకాల వస్త్రాలు ధరించి పురోహితులు ను రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు..చెప్పు లు అనేవి పూర్తి నిషిద్ధం కేశఖండన శాలలో కూడా చెప్పులు కూడా ధరించడం చేస్తున్నారు.

ప్రసాదం కేంద్రంలో..

ప్రసాదం కేంద్రం ఎప్పుడు తెరుస్తారో ఎప్పుడు మూస్తారు అర్థం కానిపరిస్థితి ఉంది నిత్యం. అక్కడ భక్తులు కు ,ఉద్యోగుల కు మధ్య ఘర్షణలు జరుగుతున్న పట్టించుకోవడం లేదు అని తెలిపారు. అంతులేని ఈ అక్రమాలు గురించి సీఎం జగన్ మోహన్ రెడ్డికి నివేదిక అందచేస్తా మని.చర్యలు కోరుతామని అఖిలభారత బ్రాహ్మణ( సర్వీస్) నెట్వర్క్ నేతలు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.