దళిత బందు స్వాగతించాలి —

0
TMedia (Telugu News) :

దళిత బందు పథకం అనేది దళితుల ఆర్ధిక స్థితిలో మార్పు తెచ్చి వారి సామాజిక స్థాయి ని పెంచుతుంది. సమాజంలో వారి గౌరవం పెరుగుతుంది.దళితుల జీవితాలు దెగ్గర గా చూసిన వ్యక్తిగా,వారి ఇళ్ల లో వారు పెట్టింది తిని అక్కడే 100 రోజులు వివిధ దళిత వాడల్లో జర్నలిస్టు గా విధులు నిర్వర్తిస్తూ నివాసం ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గం కు చెందిన వ్యక్తిని…టిఆర్ఎస్ కార్యకర్తను కాను..ఒక్క మాటలో చెప్పాలి అంటే టిఆర్ఎస్ విధానాలు కు వ్యతి రేక మైనవ్యక్తి ని..వ్యక్తిపూజతత్వం సహించని వాడిని.

దైన్యం మయిన జీవితం ను వాళ్ళు అనుభవిస్తున్నారు.కేసీఆర్ గారు హుజూరాబాద్ లో ప్రయోగాత్మకం గా అమలు చేస్తున్నము అన్నారు..రాష్ట్రం మొత్తం కావాలి అని కొందరు,మా కులాలు కు కావాలి అని కొందరు కోరుతున్నారు. తప్పులేదు..నేను మాత్రం ఒకటే కోరుతున్న ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అందరూ ఏకీభవించాల్సిన అవసరం కూడాలేదు.ఆర్ధికంగా ఆపై సామాజిక ముగా వెనుక బడిన పథకాలు కులం, మతం,ప్రాతం తో నిమిత్తం లేకుండా అమలు కావాలి.అంటే నేను చెప్పిన సమస్యకు శాశ్విత పరిష్కరం అవసరం. అది ఒక్క డబ్బులు (మని ఫ్లోటింగ్ )పంపిణీ తోనే సాధ్యం కాదు..చరిత్ర చెబుతున్న సత్యం.

ఉదాహరణకు దేశం లోనే మొదటి సరిగా తెలంగాణ ప్రభుత్వం బ్రాహ్మణులు కు కుల సర్టిఫికెట్ లు జారీ చేయడం తో పాటు ఆర్థికము గా వెనుక బడిన బ్రాహ్మణ కుటుంబాల వారికి 5 లక్షలు వరకు బ్యాంకులు తో సమందం (లింకేజీ)లేకుండా సబ్సిడీ ఖాతాల్లో జమ చేస్తోంది..విదేశీ పీజీ చదువు కొనే వారికి 20 లక్షలు ఇస్తోంది.. లబ్ది దారుల్లో అన్ని పార్టీలు వారు ఉన్నారు..ఆ డబ్బులు సద్వినియోగం చేసుకొని తమ స్థితి గతుల్లో మార్పు తెచ్చుకొని వివిధ కారణాలతో ..అయిన వారిలో,స్నేహితుల్లో పోగొట్టు కొన్న గౌరవం తిరిగి పొందిన వారు 98 శాతం మంది బ్రాహ్మణులు ఉన్నారు..మిగిలిన 2 శాతం మంది దుర్వినియోగం చేసి కొద్ది గొప్ప ఉన్న మర్యాద పోగొట్టుకున్నారు..ఈ పధకం అమలుకు ఎస్సి, ఎస్టీ,బిసి కార్పొరేషన్ ల ద్వారా ఇచ్చే సబ్సిడీ రుణాల నిబంధనలు బ్రాహ్మణులు కు పెట్టారు..మినహాయింపు ఇవ్వ లేదు..అదే సందర్భము లో మాకు కుల సర్టిఫికెట్ కావాలి,బెస్ట్ ,వివేకానంద లాంటి పధకాలను అమలు చేయాలి అని నేటికి మరి కొన్ని సామాజిక వర్గాల వారు కోరుతున్నారు.వారి కోరిక న్యాయ మైంది. నేర వేరాలి అని కోరుతున్నాను… ఇక్కడ చెప్పేది కోరిక తప్పు లేదు..నేను అడిగింది చేసేవరకు నీవు చెయ్య దలిచింది అపుచెయ్యి అనే భావన వచ్చే విధంగా మాటలు సరి కాదు..విందు ప్రాంభించారు.అందరికి ఒకేసారి వడ్డన చేసే పరిస్థితి లేదు.బ్యాచిలు వారిగా పెడతారా..?కొద్ది మందికి పెడతారా చూద్దాం.

s s consultancy

అవకాశం ఉండి అందరికి పెట్టకుండా మమా అనిపిస్తే ఏమి చెయ్యాలి అన్నది అప్పుడు నిర్ణయించి ఆచరణలో కి వెళ్ళాలి. సమాజంలో నేటికి వివిధ రకాల రూపాల్లో అణిచి వేతకు,చీదరింపు లకు దళితులు గురి అవుతున్నారు.అందరి కి ఓకే సారి న్యాయం జరిగే పరిస్థితి కనిపించడంలేదు…హుజురాబాద్ లో ఉన్న 20 వేల కుటుంబాల వరకు ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. వినియోగించుకోండి.ప్రభుత్వ విధివిధానాలు ఆనుగుణం గా అక్కడిదళితులు వద్ద పత్రాలు ఉన్నాయా..లేక పొతే సహాయ పడి వారికి ఇప్పిద్దాము. అండగా నిలుద్దాం.కులం,మతాలకు,రాజకీయాలు కు అనుగుణంగా.. ఎందుకు చెపుతున్న అంటే ఒక్కసారి మన ముందు తరం వైపు ఆలోచించండి. …ఆనాడు ఈ చెప్పు ల షాపులు,తయారీ కర్మాగారంలు లేవు..మన తాత లు ,తండ్రులు కు ఎన్ని ఆస్థులు ఉన్న దళితులు కుట్టిన చెప్పు లు మాత్రమే దిక్కు అయ్యాయి.ఆ కిర్రు చెప్ప ల తోనే దర్పంగా మన పూర్వీకులు బ్రతికారు..నేటికి మన ఇంట్లో ఎవరన్నా పోతే పాడే కట్టేది, కర్ర కొట్టేది.శవం పూర్తిగా దహనం,దానం అయ్యే వరకు అక్కడ ఉండేది ఎవరు అన్నది ఆలోచించండి..

కొంతమంది దళితులు ఆర్ధికంగా ఉన్నత స్థితిలో ఉండ వచ్చు.ముందు చెప్పిన పర్యటన లో అటువంటి వారి ఇంట్లొ కూడా బస చేశా. వారికి మరో రకమైన వివక్షత ఉంది..ఏది ఏమైనా దళిత బందు పధకాన్ని స్వాగతించండి. కేసీఆర్ గారు హుజురాబాద్ అంటున్నారు గా అక్కడ పకడ్బందీ గా ఈ పథకం అమలు అయ్యే విధంగా అందరం తల ఒక చెయ్యివేద్దాం.ఎన్నికల పధకం ,మరో పధకమా అన్న చర్చ ఎన్నికలు వరకు పెక్కకు పెడదాము..అందరూ అలోచించండి అని కోరుబకంటున్నాను.

శనగపాటి మురళి కృష్ణ
(ఫ్రీలాన్స్ జర్నలిస్టు)

The  Dalit Bandhu scheme changes the economic status of Dalits  and raises thier social status. Their respect in the society will increase. 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.