డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలి

సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గౌతం గోవర్ధన్ డిమాండ్.

0
TMedia (Telugu News) :

టి మీడియా ప్రతినిధి//గోదావరిఖని,జులై 18

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం రామగుండం కార్పొరేషన్ లో నత్త నడక నడుస్తుందని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ గౌతం గోవర్ధన్ ఆరోపించారు.
గోదావరిఖని భాస్కర్ రావు భవన్ లో ఆదివారం రోజు జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తె, వాటిని అవహేళన చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో కూడిన లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం, ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానం లో భాగంగా ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇచ్చి, వారిని ఆదుకుంటామని చెప్పిన కేసిఆర్ ప్రభుత్వం రెండవ సారి కూడా అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినప్పటికీని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి కాలేదని ఆరోపించారు.రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో గొప్పలు చెప్పుకోవడం తప్ప ఆచరణలో అమలు చేయడం లో వైఫల్యం చెందిందని విమర్శించారు.ప్రభుత్వం కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించక పోవడం వల్ల ఇండ్ల నిర్మాణాలు నిలిచిపోయాయని పేర్కొన్నారు

s s consultancy

Also Read:ధర్మల్ పవర్ ప్లాంట్ లోని కోల్ క్రషర్ లో పడి కాంట్రాక్టు కార్మికుడు మృతి

.ప్రభుత్వం కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించి ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులని డిమాండ్ చేశారు ‌. కార్పొరేషన్ అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికి,అర్హులైన వారు ఇంకా ఎంతో మంది ఉన్నారని పేర్కొన్నారు. అయినప్పటికిని కేవలం 160 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మాత్రమే నిర్మించడం బాధాకరమని అవి కూడా ఇంకా పూర్తి చేయడంలో ప్రభుత్వ అధికారులు పూర్తిగా విఫలమైనారని ఆరోపించారు.ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.లేనిచో సిపిఐ పార్టీ పక్షాన లబ్దిదారులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ గోసిక మోహన్, జిల్లా కౌన్సిల్ సభ్యులు కామ్రేడ్ తొడుపునూరి రమేశ్ కుమార్,నాయకులు శనిగరపు చంద్రశేఖర్,దుర్గం రాజేశ్వరరావు, చిలుముల రాజయ్య,మావురపు భూమయ్య, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.