8న తెలంగాణ కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే..!

0
TMedia (Telugu News) :
s s consultancy

8న తెలంగాణ కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే..!

హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం జూన్ 8న మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో రాష్ట్రంలో వైద్యం, కరోనా స్థితిగతులు, ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయ పనులు, లాక్‌డౌన్ గురించి చర్చించనున్నారు. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా కేబినెట్ చర్చించే అవకాశముంది. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలో భాగంగా, ప్రాజెక్టుల పనుల పురోగతి, చేపట్టవలసిన చర్యలు, వానాకాలం సాగునీరు, తదితర అంశాల మీద సమీక్ష జరగనుంది. వానాకాలం పంటల సాగు పనులు ప్రారంభమైన నేపథ్యంలో, పంట పెట్టుబడి సాయం రైతుబంధు అందుతున్న విషయంపై, కల్తీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల లభ్యత, తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై కూడా కేబినెట్ చర్చించే అవకాశం ఉంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.