మున్సిపాలిటీలో 1.40 కోట్ల అవినీతి వెలుగు లోకి

0
TMedia (Telugu News) :

*ధర్మపురి మున్సిపాలిటీలో 1.40 కోట్ల అవినీతి వెలుగు లోకి: పంచాయతీ గా ఉండగట..

*విచారణ చేపట్టిన జిల్లా పఅదనపు కలెక్టర్ ,డిఎల్పీఓ

టీ మీడియా ప్రతినిధి,జగిత్యాల,జూన్ 04

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురి మండల కేంద్రముగా,దక్షిణ కాశీగా పేరుగాంచిందని చెప్పవచ్చు.అలాంటి పవిత్ర క్షేత్రంలో బడా రాజకీయ నేతలు,ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతో ప్రజా ధనాన్ని ఇష్టమొచ్చిన తీరుగా పక్కదారి పట్టించిన భారీ అవినీతి తిమింగళాల కుప్పిలాగుతోంది.ఒక్కప్పుడు ధర్మపురి మేజర్ గ్రామపంచాయితిగా ఉండేది.కానీ తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత ధర్మపురి మున్సిపాలిటీగా రూపుదిద్దుకున్న తర్వాత ఇలాంటి అవినీతి ఆరోపణలు రావడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

అభివృద్ధిజరగకపోవడం,పనులు అన్ని కూడా ఎక్కడా వేసిన గొంగ్గడి అన్న చందంగా మారింది.

2006 నుంచి 2014 వ సంవత్సరం వరకు ధర్మపురి గ్రామపంచాయితిలో కోటి నలభై ( 1.40 )లక్షల రూపాయాలు భారీ అవినీతి కుంభకోణం జరిందని,ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నవని,తగిన ఆధారాలు ధర్మపురి వాసి అప్పటి మాజీ వార్డ్ మెంబర్ అజ్మత్ అలీ,పురపాలక సంఘం వైస్ చైర్మన్ ఇందారపు రామయ్య ద్వారా అవినీతి వెలుగు చూసింద ఆఅధికారులకు ఫిర్యాదులుచేయడం జరిగింది అన్నారు.2014 మే 5 వ తారీఖులో అధికారులు విచారణలు చేపత్తరని ఆంరు..నిజ నిర్ధారణలు కాగా ధర్మపురి గ్రామ సర్పంచ్ గా ఉన్న సంగి సత్తమ్మ చెక్కు పవర్ ను రద్దు చేశారు.ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు.ఒకరిని ఉద్యోగం నుంచి తొలగించారు.అప్పటి ధర్మపురి గ్రామ పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ సాయంతోనే నిధుల దుర్వినియోగం జరిందని అజ్మత్ అలీ ఆరోపించారు.ఈ విషయాన్ని ప్రజావాణి కార్యక్రమంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ గూగులోతు రవికి అలీ ఫిర్యాదు చేశామని చెప్పారు.

పంచాయితీ కోరం లేకుండానే….!

ధర్మపురి గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానాలు లేకుండానే నిధులను డ్రా చేసినట్టుగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.అప్పటి సర్పంచ్ ,ప్రస్తుత ధర్మపురి మున్సిపాలిటీ చైర్ పర్సన్ సంగి సత్తమ్మ కుమారుడు అయిన సంగి శేఖర్ బ్యాంకు ఖాతాలోకి నిధులు మళ్లించేవారని అజ్మత్ అలీ పేర్కొన్నారు.దాదాపుగా ఆ అకౌంట్ లో 22 లక్షల రూపాయాలు అదనంగా బ్యాలెన్స్ ఉన్నాయని,ఆ నిధులు ఏ పనులకు ఖర్చు చేశారో…?లేక ఎటు మళ్లించారో తెలియకపోవడంతో బ్యాoకు స్టేట్మెంట్ చూసేసరికి మున్సిపాలిటీ అకౌంట్ లో ఎటువంటి డబ్బులు లేవని,జీరో నిధులు కనిపించేసరికి అవాక్కు అయ్యానని తెలిపారు అలీ.గ్రామ పంచాయితి అధికారులను నిధుల గురించి పూర్తి సమాచారం కావాలని,ఖర్చు అయిన ప్రతి పైసా లెక్క చూపాలని,అన్నీ రకాల రికాడ్స్ అందివ్వాలని పలుమార్లు పంచాయితీ అధికారులను,చైర్పర్సన్ ను వివరాలు కోరిన సమాధానం లేదని అజ్మత్ అలీ,పురపాలక సంఘం వైస్ చైర్మన్ రామయ్య ఆరోపించారు.వీరు నిధులను పక్కదారి పట్టించారని అనుమానం వచ్చి గ్రామ పంచాయితీ అకౌంట్ నకలు స్టేట్మెంట్ తెరిచి చూడగా అందులో నిల్వ ఉన్న నిధులు లేకపోవడం చూసి ఆశ్చర్యపోయానని అన్నారుఅలీ.అసలు ఆ నిధులు ఏమైనవో,ఏయే పనుల కోసం నిధులు ఖర్చు చేశారో సదరు గ్రామ పంచాయితీ అధికారులను నిలదీసిన ఫలితం దక్కలేదు అన్నారు.గ్రామ పంచాయితీలో పని చేస్తున్న రంజిత్ అనే వ్యక్తి సదరు ధర్మపురి మున్సిపాలిటి చేర్పర్సన్ సంగి సత్తమ్మ కొడుకు సంగి శేఖర్ బ్యాంకు ఖాతాలోకి మళ్లించేవాడాని తెలుస్తుంది.అతన్ని ఎన్నిసార్లు ఖర్చు చేసిన నిధుల రికార్డ్స్ చూపించుమని పలుమార్లు అడిగిన ఇవ్వలేదన్నారు.

s s consultancy

ప్రజావాణితో వెలుగు లోకి….!

ధర్మపురి పంచాయితీ కార్యదర్శి ప్రజా ధనాన్ని పక్కదారి పట్టించడం,అధికార దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయి.ఇందులో ప్రస్తుత ధర్మపురి మున్సిపాలిటీ ఛైర్మన్ సంగి సత్తమ్మ పాలక మండలి ప్రమేయం లేకుండానే నిధులను కొడుకు సంగి శేఖర్ బ్యాంకు ఖాతాలోకి మళ్లించారని ఆరోపణలు వస్తున్నాయి.అజ్మత్ అలీ,ఇందారపు రామయ్యలు పక్క ఆధారాలతో జగిత్యాల జిల్లా కలెక్టర్ రవికి ప్రజావాణిలో సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకొని,నిధుల దుర్వినియోగం గురించి ప్రజలకు తెలుపాలని,ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కావొద్దని కలెక్టర్ రవికి ఫిర్యాదు చేశారు.ధర్మపురి పుణ్యక్షేత్రంగా పరిఢవిల్లుతున్న తరుణంలో ఇలాంటి భారీ అవినీతి కుంభకోణం వెలుగు చూడటం గమనర్హం.ఈ రకమైన అధికారులు,రాజకీయ పాలకులు ప్రశ్నించేవారు లేరనే అహంకారంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని,మరే ఏ సందర్భంలోనూ ప్రజా ధనము దుర్వినియోగం,అవినీతి తిమింగళాల పొట్టలోకి వెళ్లకుండా అడ్డుకోవాలని కోరారు.

మూడు నెలల కిం ద ధర్మపురి గ్రామ పంచాయితిగా ఉన్నప్పుడు జరిగిన అవినీతి కార్యకలాపాల్లో అధికారుల చేతివాటం చూపారు.అందులోని భాగంగా ధర్మపురి మున్సిపాలిటీలో భారీ అవినీతి జరిగిందంటూ ఫిర్యాదు చేయగా జిల్లా అధికార యంత్రాంగం విచారణ చేపట్టారు.విచారణలో భాగంగానే మునుపటి పంచాయితీ కార్యదర్శి చంద్రశేఖర్ ను,మాజీ వార్డ్ సభ్యుడు,ఫిర్యాదు దారులైన అజ్మత్ అలీ,ఇందారపు రామయ్య,ఈఈ మురళి,ఏఈ వివేకానంద,పీఆర్ ఏఈ ముకరం లను,వివిధ ఆరోపణలు ఉన్న రికార్డుల పరిశీలనకుగాను విచారణకు హాజరు కావాలని డిఎల్పీఓ ప్రభాకర్,అదనపు కలెక్టర్ అరుణ శ్రీ ఆదేశాలిచ్చారని,పలు డాక్యుమెంట్ల పరిశీలన జరుగుతుందని తెలిపారు.

పంచాయితీ రికార్డుల పరిశీలన

ధర్మపురి గ్రామ పంచాయితిగా ఉన్నప్పుటి నుండి మున్సిపాలిటీగా మారిన తర్వాత భారీ కుంభకోణం జరిగిందంటూ మాజీ వార్డ్ సభ్యుడు అజ్మత్ అలీ,వైస్ చైర్మన్ ఇందారపు రామయ్య ఫిర్యాదుల మేరకు పంచాయితీ రాజ్ కమిషనర్ హైదరాబాద్ వారికి పలుమార్లు గ్రామపంచాయితికి సంబంధించిన రికార్డులు అందజేశారని,అలానే ప్రజావాణిలో జగిత్యాల జిల్లా కలెక్టర్ జి.రవికి అన్నిరకాల డాక్యుమెంట్లు అందజేశానని ఫిర్యాదు దారులు అజ్మత్ అలీ,ఇందారపు రామయ్య పేర్కొన్నారు.జిల్లా అధికారి ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ అరుణ శ్రీ , జిల్లా డిఎల్పీఓ అధికారి ప్రభాకర్ ను విచారణ చేపట్టవల్సిందిగా అదేశాలిచ్చారు.వీరితో పాటే ఎంపిడివో నరేష్ కూడా ఈ విచారణలో పాల్గొని అప్పటి పంచాయితీ కార్యదర్శి చంద్రశేఖర్,ఈఈ మురళి,ఏఈ ప్రభుత్వ భూమిలో రెండు గదులు ప్రయివేట్ వ్యక్తులు 2018,19లో నిర్మిస్తే డివిజనల్ రికార్డు జేశారని,ఇంటిపన్ను వ్వసూలు చేసిన రూపాయలు మొత్తముతోపాటు,4 కోట్ల 60 లక్షలు రసీదులు ఉన్న యి అన్నారు.అందులోనిధులు పక్కదారి పట్టాయని,ఈ రసీదులు అన్నీ తేదీలు వేయకుండా అమౌంట్ వేయడం జరుగుతుందని,కొన్ని రసీదులలో ఉన్న తేదీలను రుద్దటం చేశారని అభియోగాలు ఉన్నాయి. గతంలో విచారణ చేపట్టిన అప్పటి జిల్లా కలెక్టర్ శరత్ 2018,19లో ధర్మపురి పంచాయితీ కార్యదర్శి చంద్రశేఖర్ ను ప్రమోషన్ మీద వేరే చోటికి కెపంపించారని,ఫిర్యాదు దారులైన అజ్మత్ అలీ,ఇందారపు రామయ్య తెలిపారు.విచారణలో భాగంగా డిఎల్ పిఓ అధికారి ప్రభాకర్,అదనపు కలెక్టర్ అరుణ శ్రీ విచారిస్తుండగా ధర్మపురి పంచాయితి 2016,17,2018,19 సంవత్సరాలలో భారీగా అవకతవకలు జరిగినట్టుగా తెలుస్తుందని,మొత్తంగా 7 అంశాల పైన పంచాయితీ రాజ్ కమిషనర్ కు నివేదికల రూపంలో ఫిర్యాదు దారులు అందజేశారని తెలిపారు.ధర్మపురి మున్సిపాలిటీగా మారిన తరువాత జిల్లా కలెక్టర్,జిల్లా పంచాయితీ అధికారి ఆదేశాల మేరకు విచారణ చేపట్టడం జరుగుతుందని అన్నారు.

పంచాయితీ అధికారి నిధుల మళ్లింపు వాస్తవమే ..!

గ్రామ పంచాయితి అధికారైన చంద్రశేఖర్ ను,ఫిర్యాదు దారుడు అజ్మత్ అలీని,ఇందారపు రామయ్యాను విచారించి అన్ని రికార్డులను,రసీదులను పరిశీలించగా వారి నుంచి వాగ్మూలాలను తీసుకున్నామని,2016,17,2018,19 కాలంలో జరిగిన అవినీతి పుట్టలను శోధించి చూడగా కొన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయని డిఎల్పీఓ ప్రభాకర్ ఆరోపించారు.అట్లాగే ఫాక్సిమామ్ కూడా విచారణ చేశామని,ఇవన్నీ క్రోడీకరించి జిల్లా పంచాయితీ అధికారికి,జిల్లా కలెక్టర్ కి నివేదిక పూర్తి స్థాయిలో అందజేసిన తరువాత ఏడు అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాకే అవినీతికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని డిఎల్ పిఓ అధికారి,అదనపు కలెక్టర్ కు వచ్చినఫిర్యాదు మేరకు కొంత అవినీతి జరిగిందని,కొన్ని రికార్డులో తప్పులు దిద్దటం,తేదీలు లేకపోవడం రికార్డుల్లో తేటలెల్లo కావడం,ఇంటి పన్నులు వసూలు చేసి డిఏతో జమ చేసిన మాట వాస్తవమేనని,ఇవన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని సమగ్ర దర్యాప్తు చేసి జిల్లా కలెక్టర్ కు నివేదిక అందజేస్తామని తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.