చింతగూడ లో కార్డెన్ అండ్ సర్చ్

రక్షణ ,భద్రత, నేరాల నిర్ములానాకే:ఆడిసినల్ డి సి పి

0
TMedia (Telugu News) :

టీ మీడియా ప్రతినిధి జన్నారం, మంచిర్యాల జిల్లా ,జులై 18.

adl dcp taking stll

 

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లోని చింతగూడ గ్రామంలో రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఏసీపీ మంచిర్యాల అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో డీసీపీ , ఏసీపీ, మొత్తం 60 మంది అధికారులు, సిబ్బంది మరియు ఎక్సైజ్ సిబ్బంది, ఫారెస్ట్ సిబ్బంది తో కలిసి ఆదివారం రోజున ఉదయం చింతాగూడ లో పోలీసులు కార్డెన్ అండ్ సర్చ్ కార్యక్రమం నిర్వహించి ఇళ్లను సోదాలు చేశారు….
ఈ సందర్భంగా ఏసీపీ అఖిల్ మహాజన్ మాట్లాడ్తు ఎలాంటి అనుమతులు లేకుండా బెల్టుషాపు నడుపుతున్న అక్రమంగా టేకు కలప నిల్వచేసిన, గుడుంబా తయారు చేస్తున్న వ్యక్తులను పట్టుకొని వారి పై సంబదిత కేసులు నమోదు చేయడం జరుగుతుంది అని తెలిలారు.వాహన పత్రాలు సరిగా లేని 62 మోటార్ సైకిల్స్ మరియు 7 ఆటోలను 10 కలప దుంగలను,10 లీటర్ల గుడుంబా ను సీజ్ చేయటం జరిగింది అని తెలిపారు. అలాగే
డిసీపీ సంజీవ్ మాట్లాడుతూ…… నేరాల నిర్మూలన కొరకే కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుందని, ప్రజల రక్షణ, ప్రజలకు భద్రత భావం సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని ,కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా నిషేధిత గుట్కా ల మరియు గుడుంబా తయారీ, బెల్టు షాపుల నిర్వహణ, ఇసుక అక్రమ రవాణా, కలప అక్రమ రవాణా వంటి చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలు పాటు పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.గుడుంబా,గుట్కా,గంజాయి లాంటి అక్రమ వ్యాపారం, చట్ట వ్యతిరేకమైన కార్యాకలాపాలకు పాల్పడకూడదన్నారు. యువత చెడు అలవాట్లకు బానిసగా మారి జీవితం నాశనం చేసుకోవద్దు అన్నారు. చట్ట వ్యతిరేకమైన పనులు చేసి కేసులు నమోదు ఐనట్లయితే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బంది పడవలసి వస్తుంది అని సూచించారు.

s s consultancy

Also Read:దేశంలోనే సీఎం జగన్ అరుదైన రికార్డు

వాహనాలు నడిపే టప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి అని సూచించారు. ఆడిసినల్ డి సి పివింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలి అన్నారు.వాహనాల సంబందించిన అని ధ్రువపత్రాలు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ కలిగి ఉండాలి అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉండి ఏదైనా ప్రమాదం జరిగిన సమయం లో ఇన్సూరెన్స్ వర్తించదు,ఇన్సూరెన్స్ గడువు ముగియాక ముందే దానిని రినివల్ చేపించుకోవాలని సూచించారు.
అలాగే మహిళల భద్రతే పోలీస్ లక్ష్యం అన్నారు.మహిళల,యువతులు,చిన్నపిల్లల తో మర్యాదగా ప్రవర్తించాలి. వారిని గౌరవించాలి. మన కుటుంబ సభ్యులతో ఎంత మర్యాదగా ఉంటామో బయట వారితో కూడా అలాగే మెదలాలి అని సూచించారు.మహిళ పట్ల, చిన్న పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన, వారిని మానసిక, శారీరకంగా హింసించిన వారిపట్ల చట్టపరమై చర్యలు తీసుకుంటాం, కేసులు నమోదు చేయడం జరుగుతుంది అని తెలిపాన కఠినరు.

 

Also Read:డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలి

ప్రజలు,మహిళలు ఆపద సమయంలో డయల్ 100 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు.సోషల్ మీడియాలో వచ్చే పలు రకాల పుకార్లను నమ్మకూడదని, వాటిలో నిజానిజాలను స్థానిక పోలీసులను అడిగి తెలుసుకోవాలి అని చెప్పారు. ప్రజల రక్షణలో భాగంగానే కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని దీనికి ప్రజలు సహకరించాలని కోరారు.గ్రామాలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాల లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
మీ గ్రామంలో ఎవరైనా కొత్తవారు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వెంటనే పోలీస్ లేదా డయల్ 100 కు ఫోన్ చేసిన వెంటనే చర్యలు చేపడతామన్నారు. తనిఖీలు నిర్వహించడం వలన నేరాల రేటు తగ్గుతాయని ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో
ఏఆర్ అడిషనల్ డిసిపి సంజీవ్, మంచేరియల్ ఎసిపి అఖిల్ మహాజన్ , లక్షెట్టిపేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నారాయణ నాయక్,జన్నారం ఎస్ఐ మధుసూధన్ రావు, లక్షెట్టిపేట ఎస్ఐ చంద్రశేఖర్, దండేపల్లి ఎస్ఐ శ్రీకాంత్, పిర్ ఏస్ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.