కరోనా బాధితులకు అండగా కాంగ్రెస్…..సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క

0
TMedia (Telugu News) :
s s consultancy

కరోనా బాధితులకు అండగా కాంగ్రెస్…..సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క
తూమాటి సేవలు అభినందనీయం..

టీ మీడియా, జూన్ 4, మధిర:
మధిర పట్టణంలోని కరోనా బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి పనిచేస్తుందని, సీఎల్పీ లీడర్ మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. శుక్రవారం మధిర ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు పొందుతున్న కరోనా బాధితులకు యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు తూమాటి నవీన్ రెడ్డి ఆర్థిక సహకారంతో ఏర్పాటుచేసిన అల్పాహార కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. నియోజకవర్గంలో కరోనా వలన ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారనీ కరోనా బాధితులకు నేటి నుంచి అల్పాహారం అందించడం అనేది అభినందనీయం అని తూమాటి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చావా వేణు,కోనా ధని కుమార్ పారుపల్లి విజయ్ దారా బాలరాజు కర్నాటి రామారావు షేక్ జహంగీర్, కోరం పల్లి చంటి తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.