వైస్ ఎంపిపి పై పోలీసులకు పిర్యాదు

0
TMedia (Telugu News) :

వైస్ ఎంపిపి పై పోలీసులకు పిర్యాదు

సోషల్ మీడియాలో పోస్టులు

s s consultancy

తనకు,తన కుటుంబానికి ప్రాణ భయం ఉందని రక్షణ కల్పించాలని విజ్ఞప్తి:చుక్క గంగారెడ్డి

టీ–మీడియా ప్రతినిధి (మే 10)జగిత్యాల జిల్లా:

జగిత్యాల జిల్లా బుగ్గారం మండల పరిషత్ ఉపాధ్యక్షులు జోగినిపెళ్లి సుచెందర్ రావు పై సమాచార హక్కు చట్టం కార్యకర్త,సీనియర్ జర్నలిస్ట్, బుగ్గారం విడిసి చైర్మన్ చుక్క గంగారెడ్డి పోలీసులకు పిర్యాదు చేశారు.వైస్ ఎంపిపి,అతని వెనుక ఉన్న రాజకీయ శక్తులతో తనకు,తన కుటుంబానికి ప్రాణ భయం ఉన్నదని,చట్టపరమైన చర్యలు తీసుకొని తగు రక్షణ కల్పించాలని బుగ్గారం ఎస్సై ఉపేంద్ర చారికి ఇచ్చిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ బుగ్గారం గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం విషయంలో బాధ్యులతో పాటు జిల్లా పంచాయతీ అధికారులపై జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేశామన్నారు.కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదు వార్తా కథనాన్ని ఒక సీనియర్ జర్నలిస్ట్ పబ్లిక్ ఆప్ ద్వారా ప్రచురించారని అన్నారు. దీని క్లిప్పింగ్ ను ఆ జర్నలిస్ట్ “ఈశ్వరన్న సేన బుగ్గారం” వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేశారని,వైస్ ఎంపిపి సుచెందర్ కు ఎలాంటి సంబంధం లేకున్నా కుట్రపూరితంగా,ఉద్దేశ్య పూర్వకంగా,దీనికి కౌంటర్ గా అసభ్యకర పదజాలంతో అవమాన పర వాఖ్యలతో, మనోభావాలు తెబ్బతినే విధంగా,మానసికంగా వేధించే విధంగా,తప్పుడు, నిరాధారమైన ఆరోపణల పోస్టులను ఆ గ్రూప్ లో బుగ్గారం వైస్ ఎంపిపి జోగినిపెళ్లి సుచెందర్ రావు పోస్ట్ చేశాడని తెలిపారు. గతంలో కూడా సుచెందర్ తనపై దాడిచేసి హత్యాయత్నం చేశాడని, మరోసారి హత్యకు ప్లాన్ వేశాడని,అనేక సార్లు మాటి మాటికి తనకు సంబంధం లేని విషయాలలో కూడా కావాలనే జోక్యం కలిగించుకొని ఇలాగే తప్పుడు ఆరోపణలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని వీటిపై కూడా పలు సందర్భాలలో పోలీస్ అధికారులకు ఎప్పటికప్పుడు పిర్యాదు చేశామని చుక్క గంగారెడ్డి పేర్కొన్నారు. జోగినిపెళ్లి సుచెందర్ రావు, అతని వెనుక ఉన్న రాజకీయ అదృశ్య శక్తుల ద్వారా,వారి కుట్ర పూరిత చర్యల ద్వారా, ఉద్దేశ్యపూర్వక,ఓర్వలేని తనంతో తనకు,తన కుటుంబానికి ప్రాణ భయం పొంచి ఉందని,తన వృత్తికి ఆటంకం కలుగుతుందని, సమాజంలో తనకున్న మంచి పేరు ప్రతిష్టలకు తీవ్ర నష్టం కలుగుతుందని,తన మనోభావాలు దెబ్బ తినే ప్రమాదం కూడా పొంచి ఉందని,మానసిక వేదనకు గురౌతున్నామని ఎస్సైకి ఇచ్చిన ఫిర్యాదు లో చుక్క గంగారెడ్డి సూచించారు. బుగ్గారం వైస్ ఎంపిపి జోగినిపెళ్లి సుచెందర్ రావు పై చట్టపరమైన చర్యలు తీసుకొని తనకు,తన కుటుంబానికి సుచెందర్ ద్వారా గానీ,అతని వెనుక ఉన్న అదృశ్య రాజకీయ శక్తుల ద్వారా గానీ ఎలాంటి ప్రాణ హాని కలుగకుండా,ఇతర నష్టాలు,ఆటంకాలు కలుగకుండా రక్షణ కల్పిస్తూ తగు న్యాయం చేయాలని బుగ్గారం ఎస్సై ఉపేంద్రా చారిని చుక్క గంగారెడ్డి కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.