కమర్షియల్ సిలెండర్ ధర రూ.122 తగ్గింపు

0
TMedia (Telugu News) :
s s consultancy

న్యూఢిల్లీ: కమర్షియల్ గ్యాస్ సిలెండర్ల (19 కేజీలు) వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మంగళవారంనాడు ఒకింత ఉపశమనం కలిగించాయి. సిలెండర్ ఒక్కింటికి రూ.122 రూపాయలు తగ్గించినట్టు ప్రకటించాయి. సవరించిన ధరతో (తాజా తగ్గింపుతో) జూన్ 1 నుంచి గ్యాస్ సిలెండర్ రూ.1,473కి దొరుకుతుంది. ప్రస్తుతం ఎల్‌పీజీ కమర్షియల్ సిలెండర్ ధర రూ.1,595.50గా ఉంది. గత మేలో ఆయిల్ కంపెనీలు ఎల్‌పీజీ గ్యాస్ ధరను రూ.45 తగ్గించాయి.

ఎల్‌పీజీ గ్యాస్ సిలెండర్ల ధరల్లో దేశవ్యాప్తంగా ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి, ఒక సిటీకి మరో సిటీకి మధ్య వ్యత్యాసం ఉంది. సవరించిన ధరలతో ప్రస్తుతం ఢిల్లీలో 19 కేజీల ఎల్‌పీజీ ధర రూ.1,474.50కి చేరింది. ముంబైలో 1,422.50గా ఉంది. కోల్‌కతాలో రూ.1,544.50, చెన్నైలో రూ.1,603గా ఉంది. మేలో ఎల్‌పీజీ సిలెండర్ ధర ఢిల్లీలో రూ.1,595గా, ముంబైలో రూ.1,545గా, కోల్‌కతాలో రూ.1,667గా ఉంది. కాగా, వంట గ్యాస్ వినియోగదారులకు మాత్రం ఎలాంటి ఉపశమనం లభించలేదు. 14.2 కేజీల సిలెండర్ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎలాంటి తగ్గింపు ప్రకటన చేయలేదు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.